CM Chandrababu: జూన్ 13న సచివాలయంలో బాధ్యతలు చేపట్టనున్న సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 12 , 2024 | 09:48 PM
ఆంధ్రప్రదేశ్ సచివాలయం(AP Secretariat)లో జూన్ 13న ముఖ్యమంత్రిగా చంద్రబాబు (CM chadrababu) బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం కుటుంబసమేతంగా ఆయన తిరుమల చేరుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం ఆయన సచివాలయానికి రానున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం(AP Secretariat)లో జూన్ 13న ముఖ్యమంత్రిగా చంద్రబాబు(CM chadrababu) బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం కుటుంబసమేతంగా ఆయన తిరుమల చేరుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం ఆయన సచివాలయానికి రానున్నారు. సాయంత్రం 4.41గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లోని ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎన్నికల హామీలపై సంతకాలు చేయనున్న చంద్రబాబు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా బాధ్యతల స్వీకరణ అనంతరం పలు హామీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు చేయనున్నారు. అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న డీఎస్సీపై మెుదటి సంతకం, గత వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని హడలెత్తించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెట్టనున్నారు. ఇక సామాజిక పింఛన్లను రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం చేస్తారు. స్కిల్ సెన్సస్ ప్రక్రియ చేపట్టడం, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపైనా సీఎం చంద్రబాబు సంతకాలు చేయనున్నారు.
ఇవి కూడా చదవండి:
CM Chandrababu: నూతన మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం..
AP Govt: వైసీపీ విధ్వంసంపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్న టీడీపీ ప్రభుత్వం..