Share News

YSR Birthday celebrations: ఈనెల 8న ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..

ABN , Publish Date - Jul 07 , 2024 | 05:54 PM

మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y.S.Rajasekhara Reddy) 75వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8న ఘనంగా నిర్వహించనున్నట్లు ఏఐసీసీ సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు(Rudra Raju), రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి(Mastan Vali) తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్టాన్ని అభివృద్ధిపధంలో నడిపారని రుద్రరాజు గుర్తు చేశారు.

YSR Birthday celebrations: ఈనెల 8న ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Y.S.Rajasekhara Reddy) 75వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8న ఘనంగా నిర్వహించనున్నట్లు ఏఐసీసీ సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు(Rudra Raju), రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి(Mastan Vali) తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్టాన్ని అభివృద్ధిపధంలో నడిపారని రుద్రరాజు గుర్తు చేశారు. ఈనెల 8న జరిగే వైఎస్ జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్, ఇతర నేతలు పాల్గొంటారని వెల్లడించారు. సోమవారం సాయంత్రం 4గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సోనియా గాంధీ పీసీసీ ఛైర్మన్ షర్మిలకు లేఖ పంపారని రుద్రరాజు తెలిపారు.


ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మాట్లాడుతూ.." 58లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుంది. రాయలసీమలో కక్షలు లేకుండా చేసిన వ్యక్తి వైఎస్ఆర్. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా విద్యార్థుల జీవితాలు మార్చిన గొప్ప నాయకుడు వైఎస్. మైనారిటీలకు ఆయనే 5శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయణ్ని స్మరించుకుంటూ సోమవారం జయంతి వేడుకను ఘనంగా నిర్వహిస్తాం. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డైరెక్షన్‌ ఆధ్వర్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి... హైదరాబాద్‌లో నిన్న (శనివారం) చంద్రబాబుతో సమావేశం అయ్యారు. విభజన హామీలకు అనుగుణంగానే చర్చలు జరిగాయి. విభజన చట్టం షెడ్యూల్ 9, 10ప్రకారం ఏపీకి రావాల్సిన వాటా వస్తుంది" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

CM Chandrababu: బాయిలర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా..

Home Minister Anitha: వైసీపీ ప్రభుత్వం నాపై 23కేసులు పెట్టింది: హోంశాఖ మంత్రి అనిత

Updated Date - Jul 07 , 2024 | 07:54 PM