Share News

AP Politics: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దూకుడు పెంచిన పోలీసులు..

ABN , Publish Date - Jul 06 , 2024 | 02:57 PM

మంగళగిరి(Mangalagiri) టీడీపీ కేంద్ర కార్యాలయం(TDP central office)పై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా... తాజాగా మరో ముగ్గురిని మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(MLC Lella AppiReddy) అనుచరులు జింకా సత్యం, లంకా అబ్బి నాయుడు, తియ్యగూర గోపిరెడ్డిగా గుర్తించి అరెస్టు చేశారు.

AP Politics: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దూకుడు పెంచిన పోలీసులు..

గుంటూరు: మంగళగిరి(Mangalagiri) టీడీపీ కేంద్ర కార్యాలయం (TDP central office)పై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా... తాజాగా మరో ముగ్గురిని మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(MLC Lella AppiReddy) అనుచరులు జింకా సత్యం, లంకా అబ్బి నాయుడు, తియ్యగూర గోపిరెడ్డిగా గుర్తించి అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టు అయ్యిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. 2021 అక్టోబరు 19న టీడీపీ నేత పట్టాభిరామ్ అప్పటి ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు చేశారంటూ టీడీపీ కేంద్ర కార్యాలయంపై జగన్ మద్దతుదారులు దాడులు చేశారు.


కార్యాలయం అద్దాలు పగలకొట్టి, కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సిబ్బందిని కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కేసును నీరుగార్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. తాజాగా ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు విషయంలో పోలీసులు దూకుడు పెంచారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన నిందితుల వివరాలు సేకరించారు. పోలీసులు అరెస్టులు చేస్తుండడంతో దాడికి పాల్పడిన వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Updated Date - Jul 06 , 2024 | 03:05 PM