Share News

Nara Lokesh: మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్..

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:43 PM

ఈవీఎంలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ (Minister Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు గెలిస్తే ఈవీఎం(EVM)లు బాగా పని చేసినట్లు, 2024లో ఓడిపోతే ఈవీఎంలపై నింద మోపుతావా? అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

Nara Lokesh: మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్..

అమరావతి: ఈవీఎంలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్(Minister Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు. "2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు గెలిస్తే ఈవీఎం(EVM)లు బాగా పని చేసినట్లు, 2024లో ఓడిపోతే ఈవీఎంలపై నింద మోపుతావా? అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. నీ వైఫల్యాలతోనే ప్రజలు నిన్ను తిరస్కరించారంటూ" జగన్ చేసిన ట్వీట్‌కు కౌంటర్‌గా మంత్రి లోకేశ్ మరో ట్వీట్ చేశారు.


మంత్రి నారా లోకేశ్ ఏమన్నారంటే..?

2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో EVMలు బాగా పని చేస్తున్నాయని చెప్పారు కదా జగన్.. మరి ఇప్పుడేమైంది. ప్రజాస్వామ్యం అంటే మీకు ఎలర్జీ. మీరు ప్రజల హక్కులను పరిరక్షించడానికి అంకితమైన సంస్థలు, వ్యవస్థలు క్రమపద్ధతిలో నాశనం చేశారు. ఏళ్ల తరబడి ఏపీ ప్రజలు సమష్టిగా నిర్మించిన వాటిని ఒక్క దెబ్బతో కొట్టిపారేశారు. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ సంస్థల్ని, వ్యవస్థల్ని నాశనం చేశారు. మీరు ప్రజల హక్కులను హరించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టుకున్న ప్రభుత్వ ఫర్నిచర్ ఎప్పుడు వెనక్కు పంపుతున్నారో చెప్పాలి. పేదల పేరు చెప్పే మీరు రుషికొండలో రూ.560కోట్లతో ప్యాలెస్ ఎలా నిర్మించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడుగుతున్నారు. ప్రజలు ఎందుకు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారో ఆలోచించి అంగీకరించండి" అంటూ మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు.


జగన్ ట్వీట్‌ సారాంశం ఏంటంటే?

ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని జగన్ అన్నారు. మన దేశంలోనూ అలాగే ఉపయోగించాలన్నారు. బ్యాలెట్ విధానంతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటే దిశగా మనం కూడా ముందుకు సాగాలన్నారు. తనకు న్యాయం జరగడమేకాదు.. జరిగినట్లు కనిపించాలని, ప్రజాస్వామ్యం మనగలగడం మాత్రమే కాదు.. మనగలుగుతుందని నిస్సందేహంగా చాటాలని జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి:

MLC Anuradha: పోలవరాన్ని మాజీ సీఎం జగన్ అదోగతి పాలు చేశారు: ఎమ్మెల్సీ అనురాధ

Updated Date - Jun 18 , 2024 | 03:58 PM