Share News

GV: ఢిల్లీ, చత్తీస్‌ఘడ్ స్కామ్‌లు చిన్నబోయేలా మద్యం అక్రమాలు..

ABN , Publish Date - Aug 17 , 2024 | 10:36 AM

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్పీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నికలలో వైసీపీ కాళ్లు, కీళ్లు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టినా జగన్‌‌లో ఇంకా బుద్ధి రాలేదంటూ వ్యాఖ్యలు చేశారు.

GV: ఢిల్లీ, చత్తీస్‌ఘడ్ స్కామ్‌లు చిన్నబోయేలా మద్యం అక్రమాలు..
MLA GV Anjaneyulu

పల్నాడు, ఆగస్టు 17: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్పీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jaganmohan Reddy) వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు (MLA GV Anjaneyulu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నికలలో వైసీపీ (YSRCP) కాళ్లు, కీళ్లు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టినా జగన్‌‌లో ఇంకా బుద్ధి రాలేదంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ రాక్షస మద్యం విధానం సంస్కరించాలని చూస్తుంటే తప్పుడు ప్రచారామా అంటూ విరుచుకుపడ్డారు.

AP Politics: రాజకీయ విలువలకు ప్రాధాన్యత.. చంద్రబాబు నిర్ణయంతో బొత్సకు కలిసొచ్చిన అదృష్టం..


జగన్ కల్తీ, నాసిరకం మద్యంతో 30 వేల మందికి పైగా ప్రజల ప్రాణాలు తీశారన్నారు. అయిదేళ్లలో రూ.1.24లక్షల కోట్ల మద్యాన్ని జగన్ నగదు రూపంలోనే అమ్మారన్నారు. రాష్ట్రంలోని డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజల గొంతుల్లో విషం పోశారని మండిపడ్డారు.జగన్‌, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డి, మిథున్‌రెడ్డి పాపాలు అన్నీఇన్నీ కావన్నారు. ఢిల్లీ, ఛత్తీస్‌గడ్‌ కుంభకోణాలు చిన్నబోయేలా వైసీపీ హయంలో మద్యం అక్రమాలు జరిగాయన్నారు.

CM Chandrababu: ఢిల్లీలో చంద్రబాబు ఎవరెవరిని కలవనున్నారంటే?


మద్యం విధానంలో మార్పులతో కూసాలు కదులుతాయానే జే-గ్యాంగ్‌లో కలకలం చెలరేగుతోందన్నారు. చిప్పకూడు తినడం అర్థమై కావాలని కూటమి ప్రభుత్వంపై సాక్షిలో తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Politics: జగన్‌‌ను అరెస్ట్ భయం వెంటాడుతోందా..!

Telangana: అర్థరాత్రి దాడి.. హరీష్ రావు కన్నెర్ర..!

Read Latest AP News And Telangana News

Updated Date - Aug 17 , 2024 | 10:46 AM