Share News

TDP: ఓటింగ్‌లో స్త్రీ శక్తి సత్తా చాటాలి: నారా భువనేశ్వరి

ABN , Publish Date - May 13 , 2024 | 09:15 AM

అమరావతి: ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతున్న పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ( చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి) మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

TDP:  ఓటింగ్‌లో స్త్రీ శక్తి సత్తా చాటాలి: నారా భువనేశ్వరి

అమరావతి: ఏపీలో పార్లమెంట్ (Parliament), అసెంబ్లీ (Assembly) ఎన్నికలకు (Elections) జరుగుతున్న పోలింగ్ (Polling) సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ( చంద్రబాబు (Chandrababu), భువనేశ్వరి (Bhuvaneswari), లోకేష్, (Lokesh) బ్రాహ్మణి (Brahmin)) మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబేనని అబిప్రాయం వ్యక్తం చేశారు. ఓటింగ్‌లో స్త్రీ శక్తి సత్తా చాటాలని, రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపిచ్చారు. గతానికి భిన్నంగా ఓటింగ్‌ సరళిలో మార్పు కనిపిస్తోందని భువనేశ్వరి పేర్కొన్నారు.


కాగా చంద్రబాబు కుటుంబ సభ్యులు ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్‌లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గాదె రామయ్య-సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ఓటు వేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలో తెలుగుదేశం అభ్యర్థిగా నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. ఉదయాన్నే ప్రజలు వేలాదిగా పోలింగ్ బూత్‌కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ కుటుంబ సభ్యులకు ఓటర్ల కరచాలనం చేశారు. అందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు కుటుంబం ఓటు హక్కు వినియోగించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పలు పోలింగ్ కేంద్రాల్లో మొరాయించిన ఈవీఎంలు

కృష్ణాజిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులకు విధులు

వైసీపీ.. నాడు ధీమా.. నేడు డీలా!

కూటమిలో జోష్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 13 , 2024 | 09:23 AM