Share News

Crime News: పల్నాడు జిల్లా అటవీశాఖ ఉద్యోగులపై స్మగ్లర్లు రాళ్ల దాడి..

ABN , Publish Date - Jul 29 , 2024 | 01:29 PM

వెల్దుర్తి మండలం గొటిపాళ్ల వద్ద అటవీశాఖ ఉద్యోగులపై పంగోలిన్ స్మగ్లర్లు రాళ్ల దాడికి తెగబడ్డారు. దాడిలో ఇద్దరు ఉద్యోగులకు తీవ్రగాయాలు అయ్యాయి. ముందస్తు సమాచారం మేరకు పంగోలిన్లను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాపై అటవీశాఖ పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే వీరి నుంచి తప్పించుకునేందుకు నిందితులు ఒక్కసారిగా రాళ్లతో దాడి చేశారు.

Crime News: పల్నాడు జిల్లా అటవీశాఖ ఉద్యోగులపై స్మగ్లర్లు రాళ్ల దాడి..

పల్నాడు: వెల్దుర్తి మండలం గొటిపాళ్ల(Gotipalla) వద్ద అటవీశాఖ ఉద్యోగులపై పంగోలిన్(Pangolin) స్మగ్లర్లు రాళ్ల దాడికి తెగబడ్డారు. దాడిలో ఇద్దరు ఉద్యోగులకు తీవ్రగాయాలు అయ్యాయి. ముందస్తు సమాచారం మేరకు పంగోలిన్లను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాపై అటవీశాఖ పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే వీరి నుంచి తప్పించుకునేందుకు నిందితులు ఒక్కసారిగా రాళ్లతో దాడి చేశారు.


దాడిలో వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి, బీట్ ఆఫీసర్ మహేష్ బాబుకు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన అధికారులను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి సిబ్బంది తరలించారు. నిందితులు మెుత్తం ఒకే కుంటుబ సభ్యులుగా తెలుస్తోంది. అయితే వారిలో కేవలం ఒకరిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.


పంగోలిన్లను ఎందుకు స్మగ్లింగ్ చేస్తారంటే..!

అంతరించిపోతున్న జంతువుల జాబితాలో పంగోలిన్‌లు కూడా ఉన్నాయి. సాధారణంగా భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల నుంచి ఎక్కువగా విదేశాలకు వీటిని అక్రమ రవాణా చేస్తుంటారు. పంగోలిన్లలో మంచి ఔషధ గుణాలు ఉండటం, దాని మాంసం కూడా చాలా రుచికరంగా ఉండడంతో చైనాలో వీటికి భారీగా డిమాండ్ పెరిగింది. దీని వల్లనే మన దేశం నుంచి వీటి అక్రమ రవాణా పెరిగింది. 2003- 2014మధ్య కాలంలో ఈశాన్య రాష్ట్రాల నుంచే అధికంగా అక్రమ రవాణా ఉండేది. ప్రస్తుతం తమిళనాడు, ఉత్తరాఖండ్‌ సహా పలు రాష్ట్రాల నుంచి వీటిని తరలిస్తున్నారు. అరుదైన ఈ జంతు జాతిని రక్షించాలని వన్యప్రాణి సంరక్షకులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఇప్పటికే వీటి రవాణాపై ప్రభుత్వ కఠినంగా వ్యవహరిస్తోంది.

Updated Date - Jul 29 , 2024 | 01:31 PM