Share News

NRI: తానా కళాశాల న్యూ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కల్యాణ కూచిపూడి నృత్య ప్రదర్శన..

ABN , Publish Date - Jun 07 , 2024 | 09:20 AM

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) కళాశాల న్యూ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో "శ్రీ సీతారామ కల్యాణ కూచిపూడి నృత్య" ప్రదర్శన కార్యక్రమం ఘనంగా ముగిసింది. యూఎస్‌లోని గ్రేటర్ బోస్టన్‌లో శ్రీ కూచిపూడి నాట్యాలయ, తానా కళాశాల న్యూ ఇంగ్లాండ్ డైరెక్టర్ శైలజా చౌదరి ఆధ్వర్యంలో సుమారు 200మంది విద్యార్థులు, విద్యార్థినిలు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు.

NRI: తానా కళాశాల న్యూ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కల్యాణ కూచిపూడి నృత్య ప్రదర్శన..

ఎన్నారై: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) కళాశాల న్యూ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో "శ్రీ సీతారామ కల్యాణ కూచిపూడి నృత్య" ప్రదర్శన కార్యక్రమం ఘనంగా ముగిసింది. యూఎస్‌లోని గ్రేటర్ బోస్టన్‌లో శ్రీ కూచిపూడి నాట్యాలయ, తానా కళాశాల(Tana College) న్యూ ఇంగ్లాండ్ డైరెక్టర్ శైలజా చౌదరి ఆధ్వర్యంలో సుమారు 200మంది విద్యార్థులు, విద్యార్థినిలు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు.


శ్రీ సీతారామ కల్యాణ కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను కట్టిపడేసింది. 200మంది కళాకారులు ప్రదర్శన ఇవ్వడంతో చూసేందుకు ప్రేక్షకులకు రెండు కళ్లూ సరిపోలేదు. కల్యాణ మహోత్సవ వైభవాన్ని వివరంగా తెలిపేలా కార్యక్రమం నిర్వహించారు. సీతారాముల కలయిక వారి వివాహం గురించి కూచిపూడి నృత్య ప్రదర్శన ద్వారా విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శన చూపరులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ అసాధారణ ప్రదర్శనకు ప్రేక్షకులు నాన్‌స్టాప్‌గా చప్పట్లు కొట్టారు. కార్యక్రమానికి సుమారు 400మంది ప్రేక్షకులు హాజరయ్యారు. అనంతరం తానా మాజీ కోశాధికారి అమ్మని దాసరి.. కళాశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ పద్మావతి యూనివర్శిటీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తానా న్యూఇంగ్లాండ్ ప్రాంతీయ ప్రతినిధి సోంపల్లి కృష్ణప్రసాద్ ప్రసంగించారు.


కార్యక్రమంలో తెలుగు గ్రేటర్ బోస్టన్ అధ్యక్షురాలు దీప్తి గోరా, శ్రీనివాస్ గొండి, శివ డోకిపర్తి, చంద్రారెడ్డి, సురేశ్ దగ్గుబాటి, రామకృష్ణ కొల్లా, కీర్తి తొగరు, సాయి లక్ష్మి, ఉమా కంతేటి, అనంతా జయం, మాధవి పోరెడ్డి, రజని దగ్గుబాటి, కోటేశ్ కందుకూరి, సూర్య తేలప్రోలు, రమణ బిల్లకంటి, సురేశ్ సూరపరాజు, మురళీ పసుమర్తి పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కూచిపూడి నాట్యాలయ, తానా కళాశాల న్యూ ఇంగ్లాండ్ డైరెక్టర్ శైలజా చౌదరి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 07 , 2024 | 09:20 AM