Share News

Tirumala Laddu: సుప్రీంకోర్టు చెప్పినా.. లడ్డూ వివాదంపై రాజకీయమే.. తీరు మార్చుకోని వైసీపీ

ABN , Publish Date - Oct 05 , 2024 | 02:41 PM

కల్తీ జరిగిందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించింది. దీనిపై రాజకీయం చేయవద్దని అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. అయినప్పటికీ వైసీపీ మాత్రం తన తీరును మార్చుకోవడంలేదనే చర్చ జరుగుతోంది. సుప్రీం గత విచారణలోనూ..

Tirumala Laddu: సుప్రీంకోర్టు చెప్పినా.. లడ్డూ వివాదంపై రాజకీయమే.. తీరు మార్చుకోని వైసీపీ
YS Jagan

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సీబీఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుంచి ఒకరితో సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే విషయంపై ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ చేయనుంది. కల్తీ జరిగిందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించింది. దీనిపై రాజకీయం చేయవద్దని అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. అయినప్పటికీ వైసీపీ మాత్రం తన తీరును మార్చుకోవడంలేదనే చర్చ జరుగుతోంది. సుప్రీం గత విచారణలోనూ, శుక్రవారం నాటి విచారణలోనూ లడ్డూ వివాదాన్ని రాజకీయం చేయవద్దని సూచించింది. కానీ వైసీపీ మాత్రం సుప్రీం ఆదేశాలకు భిన్నంగా వ్యవహారిస్తోందనే ప్రచారం జరుగుతోంది. సుప్రీం తీర్పుతో కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని, చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలిందంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని స్పష్టం చేయలేదు. కల్తీ జరిగిందా లేదా అనే విషయాన్ని తేల్చడం కోసం స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దర్యాప్తు సంస్థ నివేదిక ఇవ్వకుండానే లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదనట్లు వైసీపీ ప్రచారం చేస్తోంది.

Tirupati: ఏబీఎన్ చొరవ.. క్యాన్సర్ రోగి చివరి కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు


అసలేం జరిగింది..

తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిని సరఫరా చేసే సంస్థల్లో ఏఆర్ డెయిరీ ఒకటి. ఈ సంస్థ తిరుమలకు పంపించిన నెయ్యి ట్యాంకర్లలో కల్తీ జరిగడంతో గతంలో వెనక్కి పంపిన ఘటనలు ఉన్నాయి. ఈ విషయాన్ని మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. ఈ ఏడాది జులైలో కూడా ఏఆర్ డెయిరీ పంపించిన నెయ్యి స్వచ్ఛంగా లేకపోవడంతో టీటీడీ అధికారులు ఆ నెయ్యిని వెనక్కి పంపించారు. తరచూ ఈ సంస్థ కల్తీ నెయ్యి ట్యాంకర్లను పంపిస్తుండటంతో గతంలో ఈ సంస్థ పంపిణీ చేసిన నెయ్యిని లడ్డూలో ఉపయోగించడంతో లడ్డూ కల్తీ జరిగిందనే అనుమానాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు పలు హైందవ సంఘాలు అనుమానించాయి. ఏఆర్ డెయిరీ పంపిణీ చేసే నెయ్యిలో జంతు వ్యర్థాలు కలిశాయని ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చింది. దీంతో లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగి ఉంటుందని, దీనిపై దర్యాప్తు చేయాలనే డిమాండ్ హైందవ సంఘాల నుంచి బలంగా వినిపించింది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఈ వివాదంపై వైసీపీ నేతలు అతిగా స్పందించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది.

Mantena: ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మంతెన


కోట్లాదిమంది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడంతో కొందరు వాస్తవాలను నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించింది. సుప్రీం నిర్ణయం సీఎం చంద్రబాబుకు, టీడీపీకి బిగ్ షాక్ అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సుప్రీం నిర్ణయాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబు స్వాగతించారు. రాష్ట్రప్రభుత్వానికి చెందిన అధికారులను దర్యాప్తు బృందంలో సుప్రీం భాగస్వామ్యం చేసింది. అయినప్పటికీ వైసీపీ మాత్రం లడ్డూ వివాదంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు అసత్య ప్రచారం చేస్తుందని టీడీపీ, జనసేన నాయకులు విమర్శిస్తున్నారు. లడ్డూ వివాదాన్ని రాజకీయాలకు వాడుకోవద్దన్న సుప్రీం నిర్ణయాన్ని ఇప్పటికైనా వైసీపీ గౌరవిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.


Minister Narayana: బుడమేరు ఆక్రమణలతో విజయవాడ ముంపునకు గురైంది

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 05 , 2024 | 02:42 PM