Share News

Chandrababu: ఎన్నికల హామీల అమలు దిశగా.. సాధ్యం కాదన్నా.. చేసి చూపించారు..!

ABN , Publish Date - Jul 01 , 2024 | 07:03 AM

ఏపీలో పండగ వాతావరణం నెలకొంది. ఒకటో తేదీన ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయో లేదో తెలీదుకానీ.. 65లక్షల మందికి పైగా పెన్షన్ దారులకు పెన్షన్ (Penssion) డబ్బులు అందుతున్నాయి.

Chandrababu: ఎన్నికల హామీల అమలు దిశగా.. సాధ్యం కాదన్నా.. చేసి చూపించారు..!
CM Chandrababu

ఏపీలో పండగ వాతావరణం నెలకొంది. ఒకటో తేదీన ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయో లేదో తెలీదుకానీ.. 65లక్షల మందికి పైగా పెన్షన్ దారులకు పెన్షన్ (Penssion) డబ్బులు అందుతున్నాయి. సాధారణంగా ప్రతి నెల ప్రభుత్వం సామాజిక ఫించన్లు ఇస్తూ ఉంటుంది. కానీ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీ(AP)లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే రూ.3వేల పెన్షన్.. రూ.4వేలకు పెంచుతామని.. దివ్యాంగుల పెన్షన్ రూ.6వేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సంతకాలు చేశారు. అధికారంలోకి వచ్చిన మరుసటి నెల నుంచి పెంచిన ఫించన్లు ఇస్తామని టీడీపీ ప్రకటించింది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన ఫించన్ల పంపిణీని జులై ఒకటో తేదీన ప్రారంభించింది. మంగళగిరి నియోజకవర్గం పెనమాకలో సీఎం చంద్రబాబు పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. వివిధ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

65 లక్షల మందికి రూ.4,408 కోట్ల పింఛను


సాధ్యం కాదన్నారు..

రూ.3వేల ఫించను రే.4వేలకు పెంచుతామంటే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయడం సాధ్యం కాదని వైసీపీ నాయకులు విమర్శించారు. కేవలం ఓట్ల కోసం హామీలు ఇస్తున్నారని ఎన్నికల సభల్లో స్వయంగా మాజీ సీఎం జగన్ చెప్పారు. అయినాసరే ఇచ్చిన హామీ అమలు చేస్తామనే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించారు టీడీపీ నాయకులు. వృద్ధులు, వితంతువులకు రూ.3వేల నుంచి రూ.4వేలకు ఫించను పెంచగా.. దివ్యాంగులకు రూ.3వేల నుంచి రూ.6వేలు అందిస్తున్నారు.


దేశంలో మొదటిసారి..

వృద్ధులు, వితంతువులకు రూ.4వేలు పెన్షన్ ఇస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పటివరకు హర్యానాలో మాత్రమే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు రూ.3వేల పెన్షన్ అందిస్తుండగా.. 2024 జూన్ వరకు ఆంధ్రప్రదేశ్‌లోనూ రూ.3వేల పెన్షన్ అందించారు. పెంచిన పెన్షన్లతో అధిక మొత్తంలో పెన్షన్ పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

pension : పింఛన్ల పండగ నేడే అవ్వాతాతల చేతికి 7 వేలు


అందరి అంచనాలు తలకిందులు..

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే హామీలు అమలు చేయరంటూ విపక్షాలు విమర్శించాయి. దీనికి సంబంధించి గత అనుభవాలను ప్రస్తావించారు. కానీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ప్రజలు విపక్షాల మాటలను నమ్మలేదని స్పష్టమైంది. టీడీపీ హామీలను విశ్వసించినట్లు అర్థమైంది. వాస్తవానికి టీడీపీ ఇచ్చిన హామీలను అమలుచేయదని.. జులై నుంచి ఫించన్ల పెంపు సాధ్యం కాదని విపక్ష వైసీపీ భావించింది. కానీ సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.
Botsa Satyanarayana: టీడీపీ విధానాలపై బొత్స సత్యనారాయణ ప్రశంసలు


అదనంగా రూ.3వేలు..

వాస్తవానికి తాము అధికారంలోకి వచ్చిన తరువాత నెల నుంచి పెంచిన పెన్షన్ డబ్బులు ఇవ్వడంతో పాటు.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత నెలనుంచి.. అంటే ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి ఫించన్ల పెంపు వర్తింపచేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. దీంతో మూడు నెలలకు సంబంధించి మూడు వేల రూపాయిలు కలిపి మొత్తం రూ.7వేల ఫించను వృద్ధులు, వితంతువులకు అందిస్తున్నారు.


4న ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 01 , 2024 | 07:19 AM