Share News

AP CID: పానుగంటి చైతన్యకు మరో 11 రోజుల పాటు రిమాండ్

ABN , Publish Date - Oct 28 , 2024 | 04:31 PM

Andhrapradesh: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ1 గా ఉన్న వైసీపీ నేత పానుగంటి చైతన్య కస్టడీ ముగియడంతో ఈరోజు (సోమవారం) ఏపీ సీఐడీ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. చైతన్యను మూడు రోజుల పాటు సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దాడికి సంబంధించి పలు ముఖ్య విషయాలను సీఐడీ పోలీసులకు చైతన్య చెప్పినట్లు తెలుస్తోంది.

AP CID: పానుగంటి చైతన్యకు మరో 11 రోజుల పాటు రిమాండ్
TDP office attack case

గుంటూరు, అక్టోబర్28: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ1 గా ఉన్న వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్యను (YSRCP Leader Panuganti Chaitanya) ఏపీ సీఐడీ పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచింది. చైతన్య కస్టడీ ముగియడంతో సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. చైతన్యకు కోర్టు మరో 11 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో చైతన్యను వైద్య పరీక్షల అనంతరం జిల్లా జైలుకు పోలీసులు తరలించనున్నారు.

AP Govt: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు... ఆ జీవోలన్నీ అందుబాటులోకి..



కాగా.. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పానుగంటి చైతన్యను విచారణ నిమిత్తం ఏపీ సీఐడీ అధికారులు కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... మూడు రోజుల పాటు చైతన్యను విచారించేందుకు సీఐడీకి కోర్టు అనుమతించింది. శుక్రవారం (అక్టోబర్ 25) ఉదయం 11 గంటల నుంచి ఈరోజు (సోమవారం) ఉదయం 11 గంటల వరకు పానుగంట చైతన్యను విచారించేందుకు సీఐడీ పోలీసులకు కోర్టు అనుమతించింది. మూడు రోజుల పాటు సీఐడీ అధికారులు గుంటూరులో వైసీపీ నేతను తమదైన శైలిలో విచారించారు. అయితే టీడీపీ కార్యాలయంపై దాడిలో పానుగంటి చైతన్య కీలక పాత్ర వహించారని.. అతనే ప్రధానంగా ఉండి మొత్తం నడిపించినట్లుగా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బయటపడింది. ఈ నేపథ్యంలో ఈ దాడిని ఎవరు చేయించారు.. ఎవరెవరు ప్రోత్సహించారనే దానిపై ఏపీ సీఐడీ పోలీసులకు పానుగంటి చైతన్య మొత్తం చెప్పినట్లు తెలుస్తోంది.

Jethwani Case: కుక్కల విద్యాసాగర్‌కు షాకిచ్చిన హైకోర్టు



వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురాం, అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ వీరంతా సమావేశం ఏర్పాటు చేసుకుని ఆపై తమను తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడికి తీసుకెళ్లి దాడి చేయించారని చైతన్య చెప్పాడు. అలాగా ఈ దాడికి సంబంధించి పలు ముఖ్య విషయాలను కూడా సీఐడీ పోలీసులకు పానుగంటి చైతన్య చెప్పినట్లు తెలుస్తోంది. మరి వైసీపీ నేత ఇచ్చిన సమాచారం ఆధారంగా సజ్జల రామకృష్ణారెడ్డి, రఘురాం, అప్పరెడ్డి, దేవినేని అవినాష్‌లను సీఐడీ పోలీసులు విచారణ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చైతన్య.. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు. దాదాపు ఐదు నెలల పాటు తప్పించుకుని తిరిగిన చైతన్య..ఈనెల 14 మంగళిరి కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

Gold And Silver Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

Yanamala: ఇక జగన్ జీవితం పాతాళమే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 28 , 2024 | 04:35 PM