YCP Ex MLA: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంపై ఐటీ దాడులు
ABN , Publish Date - Nov 06 , 2024 | 07:28 PM
బీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంతోపాటు ఆయన కార్యాలయంపై ఐటీ శాఖ అదికారులు బుధవారం దాడులు చేశారు. అయితే ఆ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌పై గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
భీమవరం, నవంబర్ 06: బీమవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు గ్రంధి శ్రీనివాస్ నివాసంపై ఐటీ శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో ఆయన నివాసంలో లేరు. దీంతో గ్రంధి శ్రీనివాస్ ఎక్కడంటూ.. ఆయన కుటుంబ సభ్యులను ఐటీ శాఖ అధికారులు ఆరా తీశారు. ఉదయమే గ్రంధి శ్రీనివాస్ హైదరాబాద్‌కు కారులో బయలు దేరారని తెలిపారు.
Also Read: Thinmar Mallanna: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్
Also Read: సబ్జా గింజలతో ఇన్ని లాభాలున్నాయా..?
నివాసంలోని పలు గదులతోపాటు కార్యాలయంలో తనిఖీలు చేపట్టాలని.. ఈ నేపథ్యంలో వెంటనే భీమవరం తిరిగి రావాలని ఆయనకు ఐటీ శాఖ అధికారులు ఫోన్‌లో సూచించారు. దీంతో మార్గ మధ్య నుంచి స్వస్థలానికి శ్రీనివాస్ తిరుగు ప్రయాణమయ్యారు. ఆ క్రమంలో భీమవరంలోని తన నివాసానికి గ్రంధి శ్రీనివాస్ చేరుకున్నారు. ఇక ఐటీ దాడుల విషయం తెలుసుకుని అనుచర గణం భారీగా శ్రీనివాస్ నివాసానికి తరలి వస్తుంది.
Also Read: karthika Masam 2024: కార్తీక మాసంలో పాటించ వలసిన నియమాలు.. పఠించ వలసిన స్తోత్రాలు
2019 అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బరిలో నిలిచారు. ఆయనపై వైసీపీ అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్‌ను బరిలో నిలిపారు. ఈ ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. అంతేకాదు పవన్ కల్యాణ్ ఓడించి.. గ్రంధి శ్రీనివాస్ వార్తల్లో నిలిచారు. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. భీమవరంతోపాటు గాజువాక నుంచి పోటీ చేశారు. ఈ రెండు చోట్ల నుంచి ఆయన ఓటమి పాలయ్యారు.
Also Read: డొనాల్డ్ ట్రంప్‌కు వెల్లువెత్తిన అభినందనలు
ఇక 2024 ఎన్నికల్లో భీమవరం నుంచి బరిలో దిగిన గ్రంధి శ్రీనివాస్.. కూటమి అభ్యర్థి పులివర్తి రామాంజనేయులు చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ కేవలం 11 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. దీంతో ప్రతిపక్షా హోదా సైతం ఆ పార్టీకి దక్కక పోవడం గమనార్హం. మరోవైపు ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి పార్టీ కార్యక్రమాలను గ్రంధి శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు.
Also Read: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పలు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. దీంతో వారిపై ఐటీ శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఆ క్రమంలో గ్రంధి శ్రీనివాస్ నివాసంపై దాడులు చేశారు. అందులోభాగంగా ఆయన నివాసంతోపాటు కార్యాలయంపై ఏక కాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. అయితే శ్రీనివాస్ నివాసంలో ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
For AndhraPradesh News And Telugu News..