Share News

Kadapa: కూటమి ప్రభుత్వంపై ఎంపీ అవినాష్ రెడ్డి కామెంట్స్

ABN , Publish Date - Oct 03 , 2024 | 10:35 AM

కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నడిపే ఉద్దేశం లేదని, వారి దృష్టి అంతా ప్రైవేట్ మెడికల్ కలేజీల మీదే ఉందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో అరాచకపాలన నడుస్తోందంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.

Kadapa: కూటమి ప్రభుత్వంపై  ఎంపీ అవినాష్ రెడ్డి  కామెంట్స్

కడప: కూటమి ప్రభుత్వం (Kutami Govt.,)పై కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) విమర్శలు గుప్పించారు. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం నిర్వాకంవల్ల రాష్ట్రంలో 750 మెడికల్ సీట్లు (Medical Seats) కోల్పోయామని, పులివెందులకు ఈ ఏడాది 150 మెడికల్ సీట్లు వస్తే 50 సీట్లు వద్దని చెప్పారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నడిపే ఉద్దేశం లేదని, వారి దృష్టి అంతా ప్రైవేట్ మెడికల్ కలేజీల మీదే ఉందని తీవ్రస్థాయిలో విమర్శించారు. కడప పర్యటనకు వచ్చిన ఆరో గ్యశాఖ మంత్రి కేవలం జగన్మో హన్ రెడ్డిని దూషించడానికి వచ్చినట్లుందన్నారు. పెంచిన 50 సీట్లు వస్తే జగన్మో హన్ రెడ్డికి పేరు వస్తుందనే ఉద్దేశంతో 50 సీట్లు వద్దని చెప్పిందన్నారు. ఈ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల పెంచిన మెడికల్ సీట్లను విద్యార్థులు కోల్పోయారన్నారు. మెడికల్ సీట్ల గురించి మంత్రిని అడిగితే జగన్మోహన్ రెడ్డిని దూషిస్తారని అవినాష్ రెడ్డి అన్నారు.


కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో అరాచకపాలన నడుస్తోందంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. వంద రోజుల పాలనలో పులివెందులతో పాటు జిల్లా వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని అన్నారు. వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అసంతృప్తిని మూట గట్టుకుందని అవినాష్ రెడ్డి తెలిపారు.

పులివెందులలో ఇష్టానుసారంగా మట్కా, జూదం నడిపిస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. గత వంద రోజుల్లోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వైసీపీ కార్యకర్త రాంగోపాల్ రెడ్డిని నడిరోడ్డుపై కొట్టుకుంటూ టీడీపీ ఆఫీస్‌‌కు తీసుకెళ్ళారని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో పులివెందుల ప్రశాంతంగా ఉండేదన్నారు. పులివెందులలో అభివృద్ధి సంక్షేమం తప్ప ఇలాంటి సంస్కృతి లేదన్నారు. లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పులివెందులకు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదన్నారు. పులివెందులలో జగన్ చేసిన అభివృద్ధిని కొనసాగిస్తే చాలని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.


పులివెందులలో ఎంతో అద్భుతంగా నిర్మించిన మెడికల్ కాలేజ్‌కు అడ్మిషన్లు రాకుండా చేసింది కూటమి ప్రభుత్వం అంటూ అవినాష్ రెడ్డి మరోసారి ఆరోపించారు. వి కొత్తపల్లె గ్రామంలో వీఆర్ఏ నరసింహ అనే వ్యక్తిని జిలెటిన్ స్టిక్స్ పేల్చి హత్య చేశారన్నారు. పులివెందులలో విచ్చలవిడిగా డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ లభిస్తున్నాయన్నారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని రెవెన్యూ అధికారులకు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసిందన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబు బురదజల్లే విధంగా మాట్లాడటం దేశ వ్యాప్తంగా చూశారని ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిజిటల్ కార్డుల కోసం ఇంటింటి సర్వే నేటి నుంచి..

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించునున్న సీఎం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 03 , 2024 | 10:37 AM