Share News

AP Politics: పంతం నీదా.. నాదా.. కడపలో చెత్తపై యుద్ధం

ABN , Publish Date - Aug 27 , 2024 | 04:49 PM

కడపలో లోకల్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య చెత్తపై యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే వర్సెస్ మేయర్‌గా రాజకీయాలు సాగుతున్నాయి. అధికారంలోకి వస్తే చెత్త పన్ను ఎత్తివేస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలోనే ప్రకటించింది.

AP Politics: పంతం నీదా.. నాదా.. కడపలో చెత్తపై యుద్ధం
MLA vs MAYOR

కడపలో లోకల్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య చెత్తపై యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే వర్సెస్ మేయర్‌గా రాజకీయాలు సాగుతున్నాయి. అధికారంలోకి వస్తే చెత్త పన్ను ఎత్తివేస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలోనే ప్రకటించింది. తాజాగా ఈ నిర్ణయమే కడప నగరపాలక సంస్థ పరిధిలో వివాదానికి దారి తీసింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా వైసీపీ నేత సురేష్ బాబు ఉండగా.. స్థానిక ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన మాధవి రెడ్డి ఉన్నారు. ఒకరు చెత్త పన్ను కట్టవద్దని పిలుపునిస్తే.. చెత్త పన్ను చెల్లించకపోతే మున్సిపల్ సిబ్బంది చెత్త సేకరించబోరంటూ సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మేయర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కొందరు ఆయన ఇంటి వద్ద చెత్తను తెచ్చి వేయడంతో కడప రాజకీయం మరింత వేడెక్కింది. మేయర్ ఇంటి ముందు చెత్త వేయడంపై వైసీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. చెత్త పన్ను విషయంలో ఎమ్మెల్యే, మేయర్.. పంతం నీదా.. నాదా అనేస్థాయికి వెళ్లడంతో కడపలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

TDP: టీడీపీలో చేరిన మేయర్ దంపతులు


మేయర్ ఇంటి వద్ద..

కడప మేయర్ ఇంటి వద్ద చెత్త వేయడానికి నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. టీడీపీ నేతల ప్రమేయంతోనే మేయర్ ఇంటి వద్ద చెత్త వేశారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. చెత్త వేసిన వాళ్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కడప ఎమ్మెల్యే మాధవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్పుడే ఇంటికి చేరుకున్న మేయర్ సురేష్‌బాబు సైతం టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Buddha Venkanna: మాపై అకారణంగా పిన్నెల్లి బ్రదర్స్ దాడి


అసలేం జరిగింది..

వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నును వసూలు చేయడం ప్రారంభించింది. మున్సిపాల్టీల్లో మొదలుపెట్టి.. గ్రామ పంచాయతీ పరిధిలోనూ చెత్త పన్నును వసూలు చేయడం ప్రారంభించారు. చెత్త పన్ను వేయడాన్ని అప్పడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచారంలో సైతం చెత్త పన్ను నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పింది. పురపాలక సంస్థ పరిధిలో ఒక రకమైన పన్నును, నగర పాలక సంస్థ పరిధిలో స్లమ్‌లో ఒక రకమైన పన్ను, మిగతా ప్రాంతంలో మరో రకమైన పన్నును వసూలు చేస్తూ వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చెత్త పన్నును వసూలు చేసేవాళ్లు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్నును రద్దు చేసింది. పురపాలక, నగర పాలక సంస్థల పరిధిలో చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశాలు జారీచేసింది. అయితే కడప నగర పాలక సంస్థ పరిధిలో వైసీపీ కార్పొరేటర్లు ఎక్కువుగా ఉండటంతో.. చెత్త పన్నును వసూలు చేయాల్సిందేనని మేయర్ సురేష్ బాబు సిబ్బందిని ఆదేశించారు. పన్ను కట్టకపోతే చెత్త సేకరణ కుదరదని మేయర్ స్పష్టం చేశారు. మరోవైపు చెత్త పన్ను కట్టేది లేదని ఎమ్మెల్యే మాధవి రెడ్డి తెగేసి చెప్పారు. మున్సిపల్ సిబ్బంది చెత్త సేకరించబోరని మేయర్ చెప్పడంతో సురేష్ బాబు ఇంటి ముందు స్థానిక ప్రజలు చెత్త పారబోయడంతో వివాదం మొదలైంది. ఈ వివాదం సద్దుమణుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.


AP Politics: వైసీపీ అధిష్టానంపై బాలినేని సంచలన కామెంట్స్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 27 , 2024 | 05:29 PM