Kutami: 7 స్థానాల్లో అభ్యర్థులు గెలిచి మోదీ, బాబు, పవన్‌లకు కానుకగా ఇస్తాం: కేశినేని చిన్ని
ABN , Publish Date - Apr 05 , 2024 | 01:56 PM
అమరావతి: ఎన్డీఏ కూటమి నేతల సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. ఈ భేటీలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, ఇన్ఛార్జ్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమన్వయంపై ప్రధానంగా చర్చ జరిగింది.
అమరావతి: ఎన్డీఏ కూటమి (NDA Kutami) నేతల సమావేశం శుక్రవారం విజయవాడ (Vijayawada)లో జరిగింది. ఈ భేటీలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, ఇన్ఛార్జ్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమన్వయంపై ప్రధానంగా చర్చ జరిగింది. 7 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, నిర్వహణ, సామాజిక మాద్యమాల్లో ప్రచారం తదితర అంశాలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని (Keshineni Chinni) మాట్లాడుతూ.. విజయవాడ పార్లమెంట్ (Vijayawada Parliament) సమస్యలపై ఉమ్మడి మేనిఫెస్టో (Joint Manifesto) రూపొందించుకుంటామని, 7 స్థానాల్లో అభ్యర్థులు గెలిచి నరేంద్రమోదీ (Narendra Modi), చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లకు కానుకగా ఇస్తామన్నారు. విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి (Sujana Choudary) మాట్లాడుతూ.. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)పై తిరగబడే పరిస్థితులు ఉన్నాయని, రాజధానిని నాశనం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తూట్లు పొడిచిందన్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (Gadde Rammohan) మాట్లాడుతూ.. ఒకప్పుడు అంతా కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళమేనని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా (YCP Social Media) పెట్టి.. ఫేక్ పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 30 ఏళ్ళు వెనకబడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కూటమి వల్లే సాధ్యమని గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.