Share News

AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం

ABN , Publish Date - Jul 25 , 2024 | 04:39 PM

Andhrapradesh: ఆంధ్రప్రదశ్ మంత్రివర్గ సమావేశం గురువారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరుగనుంది. పోలవరం డయాఫ్రం వాల్‌పై కేబినెట్‌లో రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది.

AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం
AP Cabinet Meeting

అమరావతి, జూలై 25: ఆంధ్రప్రదశ్ మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meting) గురువారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరుగనుంది. పోలవరం డయాఫ్రం వాల్‌పై కేబినెట్‌లో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. నీతి అయోగ్ సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పెట్టాల్సి ఉండటంతో దానిపై కేబినెట్‌లో చర్చించనున్నారు.

CM Chandrababu: వారి పాలన చూశారు.. ఇప్పుడు దానికి భిన్నంగా చేసి చూపుతాం


ఈ నెల 27వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రం వాల్ నిర్మాణంపై సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు పెట్టనున్నారు. నీతి ఆయోగ్‌లో ప్రతిపాదనలు పెట్టే ముందు ఏపీ కేబినెట్ ఆమోదం తప్పనిసరి. ఈ మేరకు పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. అలాగే కేంద్రబడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వడంపై కేంద్రాన్ని అభినందిస్తూ కేబినెట్‌లో తీర్మానం చేసే అవకాశం ఉంది.

Bhatti Vikramarka: బడ్జెట్ అనంతరం కేసీఆర్‌పై భట్టి సంచలన వ్యాఖ్యలు


కాగా.. ఈనెల 23న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి వరాల జల్లు కురిసింది. ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించినట్టు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించిన విషయం తెలిసిందే. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఈ ఏడాది రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ఏపీకి కేంద్రం ప్రకటించింది. వచ్చే సంవత్సరాల్లో అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని అదనపు నిధులు అందిస్తామని చెప్పారు. పోలవరం నిర్మాణానికి కూడా కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. వీలైనంత త్వరగా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని బడ్జెట్‌లో కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. పోలవరం ఏపీ జీవనాడిగా పేర్కొన్నారు. ఆహార భద్రతకు కూడా పోలవరం నిర్మాణం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం అండగా ఉంటుందని.. అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

KCR: కాంగ్రెస్ సర్కార్‌ను చీల్చి చెండాడుతాం.. బడ్జెట్‌పై కేసీఆర్


మరోవైపు ఈరోజు (గురువారం) అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా కొనసాగాయి. రాష్ట్రంలోని సమస్యలపై ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దయనీయంగా మారిన శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వైసీపీ చేసిన అరాచకారలను అసెంబ్లీ సాక్షిగా సీఎం బట్టబయలు చేశారు. మొత్తం అయిదు అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని తెలిపారు. వైసీపీ హాయంలో ఎన్ని అరాచకాలు చేయాలనుకున్నారో అన్ని చేశారని సీఎం విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తనపై 17 కేసులు పెట్టిందని.. అయితే బాబ్లీ కేసు తప్ప తనపై గతంలో ఎప్పుడూ కేసులు లేవని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కూడా 7 కేసులు పెట్టారని గుర్తుచేశారు. విపక్ష నేతలను అణచివేసే కుట్ర చేశారని మండిపడ్డారు.


ఇవి కూడా చదవండి...

Bhuvaneshwari: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై భువనమ్మ ఏం చెప్పారంటే?

Madanapalle Fire Accident: మదనపల్లి కేసులో కీలక ఆధారాలు లభ్యం

Read Latest AP News And Telangana News

Updated Date - Jul 25 , 2024 | 04:45 PM