Pawankalyan: అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నా
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:36 AM
Andhrapradesh: అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. నేడు పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. వ్యక్తిగత జీవితంకంటే తమ విధులకు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారని..
అమరావతి, అక్టోబర్ 21: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు సిబ్బంది చేసే త్యాగాలు మరువలేనివని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. నేడు పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. వ్యక్తిగత జీవితంకంటే తమ విధులకు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారని.. విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
CM Chandrababu: తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే.. తాట తీయండి.. చంద్రబాబు ఆదేశాలు
గత పాలకులు పోలీసు శాఖను తమ రాజకీయ అవసరాలకే ఎక్కువగా వినియోగించుకున్నారని విమర్శించారు. ఫలితంగా ఉన్నత స్థాయి అధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకూ ఇబ్బందులు చవిచూశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పోలీసు శాఖ సమర్థంగా పని చేసేలా చూస్తోందని తెలిపారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
పోలీసుల సేవలు వెలకట్టలేనివి: అచ్చెన్నాయుడు
పోలీసుల సేవలు వెలకట్టలేనివని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లాలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు మంత్రి అచ్చెన్నాయుడు, ఎస్పీ మహేశ్వర రెడ్డి... నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పోలీస్ వ్యవస్థ లేకపోతే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. రాష్ట్రంలో నక్సలిజం రూపుమాపడంలో సఫలీకృతం అయ్యారన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ రావాలన్నారు. అనంతపురంలో ఓ అమ్మాయి హత్య కేసును 24 గంటల్లో ఛేదించారని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోయిందని.. వాటిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. విజయవాడ వరదల్లో పోలీస్ సేవలు మారువలేనివన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
YS Jagan: భయపడ్డారా.. కాంగ్రెస్‌తో దోస్తీ కోసమేనా రాజీ..
ఎన్‌సీసీవైపు ప్రోత్సహించాలి: మంత్రి ఆనం
నెల్లూరు జిల్లాలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు, ఆస్థులు కాపాడటంలో పోలీసుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. అమరుల కుటుంబాలకు ఆర్ధిక సహాయంతో పాటు, ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసు శిక్షణ పొంది, చివరాఖరులో అర్హత సాధించలేని వారిని దేవాదాయశాఖలో సెక్యూరిటీ గార్డ్స్‌గా నియమించే ఆలోచన చేస్తున్నామన్నారు. స్కూళ్లు, కాలేజీలలో ఎన్‌సీసీకి ప్రాధాన్యమిచ్చేలా చూడాలని.. ఎన్‌సీసీ వల్ల దేశభక్తి పెంపొందడంతో పాటు, ఎన్నో ఉపయోగాలు, అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులను ఎన్‌సీసీ వైపు ప్రోత్సహించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
YCP Leader: బోరుగడ్డ బ్యాంక్ ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బు..
Hyundai: హ్యుందాయ్ మోటార్ రికార్డ్ ఐపీవో.. స్టాక్ మార్కెట్లో ఓపెనింగ్ కోసం ఎదురుచూపులు
Read Latest AP News And Telugu News