Share News

AP HighCourt: పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

ABN , Publish Date - Aug 12 , 2024 | 04:41 PM

Andhrapradesh: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం పిన్నెల్లి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు వచ్చింది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌‌ను విచారించిన న్యాయమూర్తి వద్దకే ఈ పిటిషన్ వెళ్లాలని హైకోర్టుకు పోలీసుల తరపు న్యాయవాది అశ్వనీకుమార్ సూచించారు.

AP HighCourt: పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా
AP High Court

అమరావతి, ఆగస్టు 12: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Macharla Former MLA Pinnelli Ramakrishna Reddy) బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం పిన్నెల్లి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో (AP Highcourt) విచారణకు వచ్చింది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌‌ను విచారించిన న్యాయమూర్తి వద్దకే ఈ పిటిషన్ వెళ్లాలని హైకోర్టుకు పోలీసుల తరపు న్యాయవాది అశ్వనీకుమార్ సూచించారు. అయితే రోస్టర్ ప్రకారం ప్రస్తుతం ఉన్న కోర్టులోనే విచారించాలని పిన్నెల్లి తరపు సీనియర్ న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. ఇవన్నీ నిశితంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి వెల్లడించారు. అనంతరం కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.

Adi Srinivas: సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ సోషల్ మీడియావి కారుకూతలే...


కాగా... ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టిన కేసులో అరెస్ట్ అయిన పిన్నెల్లి గత కొద్దిరోజులుగా నెల్లూరు జైలులో ఉన్నారు. ఎన్నికల సందర్భంగా మే 13న పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్‌ ధ్వంసం చేసిన వ్యవహారంలో పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు పిన్నెల్లిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆ ధ్వంసాన్ని అడ్డుకున్న టీడీపీ ఏజెంట్‌ శేషగిరిరావుపై ఆయన దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి రెంటచింతల పోలీసులు పిన్నెల్లి, ఆయన అనుచరులు మరో 15 మందిపై హత్యాయత్నం (ఐపీసీ 307), మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేరోజు నాగశిరోమణి అనే మహిళను ఆయన బూతులు తిట్టారు. ఆమె ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మే 14న పిన్నెల్లి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి, వారి అనుచరులు సీఐ నారాయణ స్వామిపై దాడి చేసి గాయపరిచారు. దీనిపై హత్యాయత్నం, మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

TDP: మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయ్: మంత్రి అనిత


ఈ కేసులన్నిటిలో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో జూన్ 26న పోలీసులు పిన్నెల్లిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పిన్నెల్లిపై మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడు హత్యాయత్నం కేసులున్నాయి. రెంటచింతల మండలం పాల్వాయి గేట్ గ్రామంలో ఈవీఎం ధ్వంసం ఘటన ప్రధానంగా ఉంది. బెయిల్ కోసం పలుమార్లు హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్లు వేసినప్పటికీ ప్రతీసారి నిరాశే ఎదురవుతోంది. అయితే ఈనెల 14 అయినా పిన్నెల్లికి బెయిల్ వస్తుందా? రాదా? అనే ఉత్కంఠ నెలకొంది.


ఇవి కూడా చదవండి..

YSRCP : టీడీపీ హయాంలోనూ వైసీపీ కాంట్రాక్టర్ దబాయింపులు.. ఎక్కడంటే?

Pawan Kalyan: పంచాయతీలకు స్వాతంత్ర్యదినోత్సవ బడ్జెట్‌ పెంపుపై పవన్ ట్వీట్...

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 12 , 2024 | 04:41 PM