Share News

Kollu Ravindra: వర్షాలపై మంత్రి కొల్లు రవీంద్ర టెలీకాన్ఫరెన్స్

ABN , Publish Date - Aug 31 , 2024 | 04:46 PM

Andhrapradesh: పీ వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షాలపై కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి కొల్లు రవీంద్ర శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీగా కురుస్తున్న వర్షాలపై ప్రజల్ని అప్రమత్తం చేయాలన్నారు.

Kollu Ravindra: వర్షాలపై మంత్రి కొల్లు రవీంద్ర టెలీకాన్ఫరెన్స్
Minister Kollu Ravindra

అమరావతి, ఆగస్టు 31: ఏపీ వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షాలపై కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీగా కురుస్తున్న వర్షాలపై ప్రజల్ని అప్రమత్తం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని తెలిపారు. విజయవాడలో పలు ప్రాంతాలు నీట మునగడంపై మంత్రి ఆరా తీశారు.

Weather: రాష్ట్రానికి రెడ్ అలర్ట్.. ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్త..!


నీళ్లు నిలిచిపోయిన ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువల్లో నీరు పారేలా అడ్డంకులు తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మ్యాన్ హోల్స్, విద్యుత్ స్తంభాల విషయంలో అప్రమత్తం చేయాలన్నారు. అధికారులు వర్ష ప్రభావం తగ్గే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులంతా అందుబాటులోనే ఉన్నారని... వారితో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని అధికారులకు మంత్రి కొల్లురవీంద్ర సూచనలు చేశారు.

Weather: రాష్ట్రానికి రెడ్ అలర్ట్.. ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్త..!


మరోవైపు.. ఎన్టీఆర్ జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బుడమేరు వరద ప్రమాద స్థాయికి చేరుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ వేడి నీటి కాలువ కట్టకు గండి పడింది. దీంతో ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. అటు చందర్లపాడు మండలం ముప్పాళ్ల వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే బైక్‌తో వాగు దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి.. బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. చివరకు చెట్టును పట్టుకుని వరద నీటిలో సదరు వ్యక్తి చిక్కుకున్నాడు. వెంటనే గ్రామాస్థులు ఆ వ్యక్తిని సురక్షితంగా వడ్డుకు చేర్చారు. అయితే వరద ప్రవాహానికి బైక్ కొట్టుకుపోయింది.

Updated Date - Aug 31 , 2024 | 04:52 PM