Share News

AP Liquor Policy: నూతన మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం చెప్పిన మాటలివే...

ABN , Publish Date - Sep 17 , 2024 | 03:53 PM

Andhrapradesh: సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఓ ప్రత్యేక బ్రాండ్‌ను తీసుకొస్తున్నామని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు. టూరిజం పాలసీలో 3, 4 నక్షత్రాల హోటళ్లలో అధికంగా వసూలు చేస్తున్నారనే రోపణలు వచ్చాయన్నారు.

AP Liquor Policy: నూతన మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం చెప్పిన మాటలివే...
Ministerial Subcommittee comments on New Liquor Policy

అమరావతి, సెప్టెంబర్ 17: వచ్చే నెల (అక్టోబర్) 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులోకి రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతన ఎక్సైజ్ పాలసీపై మంత్రి వర్గ ఉపసంఘం మీడియా సమవేశం నిర్వహించింది. కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్, కొండపల్లి శ్రీనివాస్‌ల సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లురవీంద్ర (Minister Kollu Ravindra) మాట్లాడుతూ.. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఓ ప్రత్యేక బ్రాండ్‌ను తీసుకొస్తున్నామని అన్నారు. టూరిజం పాలసీలో 3, 4 నక్షత్రాల హోటళ్లలో అధికంగా వసూలు చేస్తున్నారనే రోపణలు వచ్చాయన్నారు. వాటిని ఎక్సైజ్, టూరిజం డిపార్టమెంట్‌లు కలిసి కుర్చోని సరిచేయనున్నామని తెలిపారు.

Viral Video: ఆ యువకుడు తోపు.. ఎందుకంటే


జనాభా ఎక్కవగా ఉన్న సిటీలలో స్మార్ట్ స్టోర్‌ల ద్వారా మద్యాన్ని అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. మద్యం షాపులను జిల్లా స్ధాయి కమిటీలు చూసుకుంటాయని.. సిండికేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో బిగ్గెస్ట్ సిండికేట్ లీడర్ జగన్మోహన్‌ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 10శాతం షాపులు కల్లుగీత కార్మికులకు ఇస్తున్నామన్నారు. గత పాలసీ సెప్టెంబర్‌తో ముగుస్తుందని.. దీనిలో భాగంగానే ప్రభుత్వ షాపులు వస్తాయా, ప్రైవేటా రేపు (బుధవారం) తేలుతుందని....కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వైసీపీ నాయకులు డిస్టలరీలు కబ్జా చేశారని.. మద్యంపై పన్నులను కూడా సమీక్షిస్తామని మంత్రి కొల్లురవీంద్ర తెలిపారు.


ఒకే రోజు రెండు జీవోలు తెచ్చి మరీ: నాదెండ్ల

ఇతర రాష్ట్రాలతో పోల్చితే గత ప్రభుత్వం విచిత్రంగా ధరలు పెంచుకుంటూ పోయారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఒకే రోజు రెండు జీవోలు 128, 129 లు తెచ్చి ఉదయం ఉన్న రేటును మార్చుతూ సాయంత్రం మరో జీవో ఇచ్చారని గత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మద్యానికిబానిసలు అయ్యేవారికి డీ అడిక్షన్ సెంట్లర్లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ప్రభుత్వమే మద్యం అమ్మితే వినియోగం తగ్గిపోతుంది అన్నారని... అయితే జగన్ వచ్చాక 1శాతం పెరిగిపోయిందన్నారు. మొదటి సారి కొన్ని ప్రీమియం అవుట్ లెట్స్ కూడా ఈసారి ప్రతిపాదించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

CP Anand: గతేడాదిలా కాకుండా త్వరగానే గణేష్ నిమజ్జనానికి చర్యలు..


అది ఎవరికీ లాభంతో అందరికీ తెలుసు: సత్యకుమార్

గత ప్రభుత్వం తెచ్చిన ఎక్సైజ్ పాలసీ ఎవరికి లాభం కలిగిందో అందరికి తెలుసని మంత్రి సత్యకుమార్ అన్నారు. గత ప్రభుత్వం నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి వారి ఆరోగ్యంతోనూ చెలగాటమాడారని మండిపడ్డారు. 2019-24 మధ్య ప్రజల ఆరోగ్యం మద్యం వల్ల ఎంతో దెబ్బతిన్నదన్నారు. చివరకు మద్యం ఆదాయంపైనా ఎస్క్రూ చేసేశారన్నారు. కాలేయ సంబంధిత వ్యాదులు, కిడ్నీ సంబంధిత వ్యాదులు 2019-24 మధ్య భారీగా పెరిగిపోయాయన్నారు. మద్యం లేకపోతే గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర మందులు వాడేలా వెళ్లిపోతారన్నారు. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాలసీలో జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.


మరోవైపు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. కేబినెట్‌లో కొత్త మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. వచ్చే నెల 1వ తారీకు నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీపై తమ ప్రతిపాదనలను కేబినెట్ ముందు మంత్రివర్గ ఉపసంఘం ఉంచనుంది. ఉపసంఘం ప్రతిపాదనలపై కేబినెట్‌లో చర్చ జరుగనుంది. అనంతరం నూతన మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...

Pawan: అభివృద్ధిలో తెలంగాణ ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ..

AP Cabinet: రేపే ఏపీ కేబినెట్ భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తారంటే.

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 17 , 2024 | 04:04 PM