Share News

Andhra Pradesh: నా ఓటమి కారణం వాళ్లే.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jun 19 , 2024 | 08:04 PM

కడప లోక్‌సభ స్థానంలో ఓటమిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. సీఎం, సిట్టింగ్ ఎంపీ కడప పార్లమెంట్ స్థానంలోని ప్రజలను భయపెట్టిన కారణంగానే తాను ఎంపీగా ఓడిపోయానన్నారు.

Andhra Pradesh: నా ఓటమి కారణం వాళ్లే.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
YS Sharmila

కడప లోక్‌సభ స్థానంలో ఓటమిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. సీఎం, సిట్టింగ్ ఎంపీ కడప పార్లమెంట్ స్థానంలోని ప్రజలను భయపెట్టిన కారణంగానే తాను ఎంపీగా ఓడిపోయానన్నారు. వైసీపీ ఓటు వేశామని తెలిస్తే తమను ఇబ్బందులు పెడతారని కడప ప్రజలు భయపడ్డారని షర్మిల తెలిపారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాల్లో కోత పెడతారని, తమకు పథకాలు రాకుండా చేస్తారనే ఉద్దేశంతోనే ఓటర్లు తనకు ఓటు వేయలేదన్నారు. పథకాలు పోతాయనే భయంతోనే వైసీపీ ఓట్లు వేశామని మహిళలు చెబుతున్నారన్నారు. ఒక్కో ఓటుకు వైసీపీ రూ.3,500 పంపిణీ చేసిందని, అనేక రకాలుగా ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపించారు. కడపలో ఓటమికి సమయం సరిపోకపోవడం కూడా ఒక కారణమని చెప్పారు. ఎక్కువ మంది ప్రజలను నేరుగా కలవలేకపోయానన్నారు.

Gorantla Butchaiah Chowdary: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల.. ఫోన్ చేసి చెప్పిన పయ్యావుల


కేవలం 14 రోజులు మాత్రమే ప్రచారం చేశానని.. రాష్ట్రం మొత్తం తిరగాల్సి రావడంతో కడపలో ప్రచారానికి సమయం సరిపోలేదని షర్మిల తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్ బిడ్డ షర్మిల పోటీచేస్తుందనే విషయం చాలామందికి తెలియలేదన్నారు. హంతకులు చట్టసభల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే తాను కడప నుంచి ఎంపీగా పోటీచేసినట్లు చెప్పారు. తన ప్రయత్నం ఫలించలేదని.. అయితే పైన దేవుడు ఉన్నాడని.. హంతకుల పాపం పండేరోజు వస్తుందన్నారు.

Parthasarathy: జగనన్న కాలనీ పేరు మార్పుపై చర్చిస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి


కాంగ్రెస్ బలం పెరిగింది..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల్లో షర్మిల పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తలెత్తుకుని తిరిగే విధంగా రాహుల్ గాంధీ పనిచేస్తున్నారన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా.. ధైర్యంగా ఎదుర్కొని తనకు తాను పైటర్ గా నిరూపించుకున్నారని షర్మిల తెలిపారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌ను అభిమానిస్తున్నారని, ఆదరిస్తున్నారని తెలిపారు. న్యాయం కోసం రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర పార్టీకి మరింత ఆదరణ పెంచిందన్నారు. రాహుల్ గాంధీ కష్టం వల్ల నేడు కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు జరిగిందని షర్మిల తెలిపారు. తన తరపున మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. 400 సీట్లు సాధిస్తామన్న బీజేపీని ఆ లక్ష్యం చేరుకోకపోవడమే కాకుండా బీజేపీకి ఒంటరిగా మెజార్టీ రాకుండా చేసిన ఘనత రాహుల్ గాంధీకి దక్కుతుందన్నారు. బీజేపీకి మరికొన్ని సీట్లు తగ్గి ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చేదన్నారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందో చెప్పలేమన్నారు. బీజేపీ పేరుకు అధికారంలో ఉన్నా.. పవర్ మాత్రం వారి చేతుల్లో లేకుండా పోయిందని ఎద్దెవా చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఇతరులపై ఆధారపడే పరిస్థితిని తీసుకువచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ అని షర్మిల పేర్కొన్నారు.


Pawan Kalyan: పవన్ తొలి సంతకం ఆ పెన్నుతోనే.. ఎవరిచ్చారంటే..?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 19 , 2024 | 08:04 PM