Purandeswari: ఏపీ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహద పడుతుంది: పురందేశ్వరి
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:33 PM
అశ్విని వైస్తాన్, సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అందరూ రూ. 2,245 కోట్ల నిధులతో ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 57 కిలోమీటర్లు మేరకు అమరావతి ప్రత్యేక రైల్వే లైన్‌ను కేంద్రం మంజూరు చేసిన అంశాన్ని ప్రకటించటం సంతోషంగా వుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి అన్నారు.
విజయవాడ: ఏపీ రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజు పండగ చేసుకోవాల్సిన అవసరం ఉందని.. డబల్ ఇంజిన్ సర్కార్ (Double Engine Circar) ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని గతంలోనే చెప్పానని.. ఇప్పుడు జరుగుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి (MP Purandeswari) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav), సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), పవన్ కళ్యాణ్, (Pawan Kalyan) అందరూ రూ. 2,245 కోట్ల నిధులతో ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 57 కిలోమీటర్లు మేరకు అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్‌ను కేంద్రం మంజూరు చేసిన అంశాన్ని ప్రకటించటం సంతోషంగా వుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహద పడుతుందన్నారు. ఏపీ ఆర్థిక అభివృద్ధితో ముడిపడిన అంశమని.. పర్యావరణ మార్పు వస్తున్న ఈ పరిస్థితుల్లో అడవికి హాని కలగకుండా అంటే 25 లక్షల చెట్లు కాపాడబడ్డాయని పేర్కొన్నారు. ఈ సందర్బంగా కేంద్రానికి ఏపీ రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదములు తెలుపుతున్నానని పురందేశ్వరి అన్నారు.
అమరావతినే రాజధాని అని మొదటి నుంచీ బీజేపీ చెబుతోందని, కేంద్రం కూడా అమరావతి రాజధాని అని మొదటి నుండి ప్రతిపాదిస్తూనే వస్తోందని పురందేశ్వరి అన్నారు. రాజధాని కోసం ప్రత్యేక నిధులు ప్రపంచ బ్యాంకుల నుంచి ఇప్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రైల్ లైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారన్నారు. వికసిత్ భారత్ 2047 వరకు సాధించాలనేది బీజేపీ లక్ష్యమని చెప్పారు. వికసిత్ భారత్ కావాలంటే.. వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమని తెలుసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సింహ భాగం కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. అమరావతి రాజధానికి ప్రత్యేక రైల్వే లైన్ మంజూరు చేసిన కేంద్రానికి మరోసారి రాష్ట్ర తరపున, ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని పురందేశ్వరి అన్నారు.
కాగా అమరావతి 2.0. ఆరంభంలోనే కేంద్రం శుభవార్త చెప్పింది. రాజధాని అమరావతి రైలుమార్గానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 2,245 కోట్లు మంజూరు చేసింది. గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం రైల్వే నిలయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్....కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌తో కలిసి తెలుగు మీడియాతో మాట్లాడారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, లావు శ్రీకృష్ణదేవరాయలతో మాట్లాడారు. రాబోయే నాలుగేళ్లలో అమరావతి రైలు మార్గాన్ని పూర్తిచేస్తామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
‘అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఏపీ ప్రజల కలల ప్రాజెక్టు. అందుకే.. ఈ నగరాన్ని రైల్వేతో అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. నవ్యాంధ్ర తొలి సీఎంగా అప్పట్లోనే చంద్రబాబు.. అమరావతికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. అది ఇప్పుడు, కూటమి ప్రభుత్వంలో సాకారం అవుతోంది’’ అని పేర్కొన్నారు. ఈ రైలుమార్గం నిర్మాణంతో అమరావతికి దేశంలోని అన్ని రాష్ట్రాలతో కనెక్టివిటి వస్తుందని పేర్కొన్నారు. వాస్తవానికి, రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులను పురోగతిలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు సమీక్షలు నిర్వహించారు. కేంద్ర రైల్వేమంత్రితో అనేక దఫాలు చర్చించారు. వీటన్నింటి ఫలితంగా అమరావతి మీదుగా ఎర్రుపాలెం - నంబూరు మధ్య నూతన రైలుమార్గాన్ని కేంద్ర కేబినెట్ ఎకనామిక్ ఎఫైర్స్ కమిటీ ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున ఈ రైలుమార్గం నిర్మాణం జరగనుంది. దీని వలన 19 లక్షల మానవ పనిదినాలు జనరేట్ అవుతాయని, ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరోసారి జిల్లాల పునర్విభజన వివాదం..
కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు..
నాలుగు హోటళ్లకు బాంబు బెదిరింపులు.
రామయ్యను దర్శించుకున్న గవర్నర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News