Share News

IRR Case: సుప్రీంలో చంద్రబాబుకు ఊరట.. ఐఆర్‌ఆర్ కేసులో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:49 PM

న్యూఢిల్లీ: సుప్రీంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుకుడు ఊరట లభించింది. ఐఆర్‌ఆర్ కేసులో సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటీషన్‌ను త్రోసిపుచ్చింది.

IRR Case: సుప్రీంలో చంద్రబాబుకు ఊరట.. ఐఆర్‌ఆర్  కేసులో  న్యాయస్థానం  కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది. ఐఆర్‌ఆర్ కేసులో సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. గతంలో సుప్రీంకోర్టు ఇదే కేసులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం దర్మాసనం స్పష్టం చేసింది.

ఐఆర్ఆర్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

420 సెక్షన్ చంద్రబాబుకు ఎలా వర్తిస్తుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. 17 ఏ సెక్షన్‌తో ఈ కేసుకు కూడా సంబంధం ఉందా? అని ధర్మాసనం నిలదీసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. కాగా ఐఆర్ఆర్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఉత్తర్వులు ఇచ్చిందని ధర్మాసనం అభిప్రాయపడింది. కేసు దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చంద్రబాబు విచారణకు సహకరించకపోతే బెయిల్ రద్దు పిటిషన్ వేసుకోవచ్చుని తెలిపింది. దీనిపై చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ.. ప్రస్తుతం ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

Updated Date - Jan 29 , 2024 | 01:00 PM