Supreme Court: విచారణకు సహకరించండి.. జోగి, అవినాశ్‌కు సుప్రీం ఆదేశం
ABN , Publish Date - Sep 13 , 2024 | 03:05 PM
Andhrapradesh: టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు జోగిరమేశ్, అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై శుక్రవారం సుప్రీంలో విచారణ జరింది. విచారణకు సహకరించాలని జోగిరమేశ్, అవినాశ్‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
న్యూఢిల్లీ/అమరావతి, సెప్టెంబర్ 13: టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు జోగిరమేశ్(Jogi Ramesh), అవినాశ్ (Avinash) ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈరోజు(శుక్రవారం) సుప్రీంకోర్టులో(Sureme Court) విచారణ జరింది. విచారణకు సహకరించాలని జోగిరమేశ్, అవినాశ్‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వుల ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు వద్దని సుప్రీం స్పష్టం చేసింది. 48 గంటల్లో పాస్‌పోర్టు సరెండర్ చేయాలని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తునకు సహకరించపోతే రక్షణ ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ దులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
Viral Video: పెట్రోల్ బంక్‌లోకి వచ్చిన సింహం.. చివరకు ఏం జరిగిందో చూడండి..
టీడీపీ ఆఫీస్‌పై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో నిందితులుగా ఉన్న దేవినేని అవినాశ్, జోగి రమేష్ ముందస్తు బెయిల్‌పై నవంబర్ 4న సుప్రీం తేల్చనుంది. ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతలు సుప్రీంను ఆశ్రయించగా... దేవినేని అవినాశ్, జోగి రమేశ్‌లకు ధర్మాసనం మధ్యంతర రక్షణ కల్పించింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. విచారణను నాలుగు వారాలకు సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.
AP Highcourt: జగన్‌కు భద్రత పిటిషన్‌పై విచారణ హైకోర్టులో వాయిదా
ముందస్తు బెయిల్‌పై నవంబర్ 4న తేల్చనున్న సుప్రీం... అప్పటి వరకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఊరటనిచ్చింది. విచారణలో భాగంగా వైసీపీ నేతల దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను ప్రభుత్వం తరపున న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్రా కోర్టుకు అందజేశారు. జస్టిస్ అమానుల్లా ఆన్‌లైన్‌లో విచారణకు హాజరయ్యారు. సీసీ పుటేజ్ తర్వాత చూస్తామని మరో జడ్జి జస్టిస్ సుంధాంశు దూలియా తెలిపారు. అవినాశ్ విచారణకు హాజరుకాకుండా విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించాడని కోర్టు దృష్టికి లాయర్ ముకుల్ రోహత్గి తీసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి...
Prandeshwari: కూటమి ప్రభుత్వ సారధ్యంలో ఏపీ అభివృద్ధి ఖాయం
YS Jagan: బాలినేని శ్రీనివాసరెడ్డితో విడదల రజినీ చర్చలు
Read LatestAP NewsAndTelugu News