AP News: ఆ విద్యార్థినిల పరిస్థితి చూస్తే కన్నీరు ఆగదు
ABN , Publish Date - Nov 11 , 2024 | 10:31 AM
Andhraprdesh: నీరు అడిగినందుకు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ఎంతో దారుణంగా ప్రవర్తించారు. దీంతో తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోయారు. చివరకు గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులు ప్రవర్తిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అది కాస్తా చర్చనీయాంశంగా మారింది.
కృష్ణా జిల్లా, నవంబర్ 11: గుడివాడలోని డా. బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో పరిస్థితి దారుణంగా మారింది. కనీస వసతులు అడిగినందుకు విద్యార్థుల (Students) పట్ల ఉపాధ్యాయులు కర్కషంగా ప్రవర్తించారు. నిరుపేదలకు మంచి విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలను ప్రభుత్వాలు తీసుకువచ్చాయి. మంచి భోజనం, విద్య కనీస వసతులు అందించడం వారి బాధ్యత. అయితే కొన్ని గురుకుల పాఠశాలలో పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. పాఠశాలల్లో జరుగుతున్న ఘోరాలను బయటకు చెప్పలేక విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.
Ponnam Prabhakar: కేటీఆర్‌కు మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్
పొరపాటున లోపల పరిస్థితులను తల్లిదండ్రులకు చెబితే ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే భయం విద్యార్థుల్లో నెలకొంది. ఇలాంటి ఘటన గుడివాడలో చోటు చేసుకుంది. నీరు అడిగినందుకు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ఎంతో దారుణంగా ప్రవర్తించారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోయారు. చివరకు గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులు ప్రవర్తిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అది కాస్తా చర్చనీయాంశంగా మారింది.
గుడివాడ రూరల్ మోటూరులోని డా. బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల దాష్టీకం అంతా ఇంతా కాదు. నీళ్లు అడిగిన విద్యార్థులకు 100 గుంజీల శిక్ష విధించారు టీచర్లు. అంతే కాకుండా విద్యార్థులతో మరుగుదొడ్లు, పారిశుద్ధ్య పనులను చేయిస్తున్న వైనం చర్చనీయాంశంగా మారింది. అయితే విద్యార్థినిలను చూసేందుకు నిన్న(ఆదివారం) తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. అక్కడ వారి పరస్థితి తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులతో సమావేశమైన చిన్నారులు తాము పడుతున్న కష్టాలను వారికి వివరించారు. దీంతో ఈ విషయంపై గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌తో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు.
పాఠశాలలో మరుగుదొడ్ల దుస్థితి, అపరిశుభ్ర వాతావరణాన్ని వీడియో తీసి మరీ సామాజిక మాధ్యమాల్లో తల్లిదండ్రులు పోస్ట్ చేశారు. ఏడవ తరగతి విద్యార్థిని చేతిలో జోడించి మరీ అక్కడున్న పరిస్థితులను అధికారులకు వివరించి.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మరుగుదొడ్లలోకి వెళ్లబుద్దికావడం లేదని.. ఆహారంలో పురుగులు ఉంటున్నాయని వెల్లడించింది. డైనింగ్ హాలు బాగోలేదని.. తాగునీరు రాక పైఅంతస్తు నుంచి నీరు మోసుకెళ్తుంటే కాళ్లు లాగుతున్నాయని విద్యార్థిని వివరించింది. అంతే కాదు ఈ విషయాలు తల్లిదండ్రులకు చెబితే తమను టీచర్లు శిక్షిస్తున్నారని విద్యార్థిని కన్నీటి పర్యంతమైంది.
అయితే గురుకుల పాఠశాలలో పరిస్థితిని చూసి తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే పారిశుద్ధ్య కార్మికులు మానేయడంతో పిల్లల చేత మరుగుదొడ్లను కడిగిస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు మరుగుదొడ్లకు తలుపులు లేవని.. దీంతో విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా.. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వర్షెన్ మరోలా ఉంది. నీరు పైకి వెళ్లే వాల్‌ను ఎవరో కావాలని ఆపివేయడం వల్లే నీరు రాలేదన్నారు. అలాగే పిల్లల చేత మరుగుదొడ్లను కడిగించడం లేదని.. పారిశుద్ధ్య కార్మికులను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
CM Chandrababu: ‘సూపర్ సిక్స్’కు ఊతం!
Rushikonda : రుషికొండ ఫైళ్లు మాయం!
Read Latest AP News And Telugu News