Share News

Anam Venkata Ramana Reddy: మున్సిపాల్టీలు, కార్పొరేషన్లని జగన్, బొత్స దోచుకున్నారు

ABN , Publish Date - Aug 22 , 2024 | 12:35 PM

ఏపీలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లని మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Anam Venkata Ramana Reddy: మున్సిపాల్టీలు, కార్పొరేషన్లని జగన్, బొత్స దోచుకున్నారు
Anam Venkata Ramana Reddy

నెల్లూరు: ఏపీలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లని మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. వందల కోట్లు ఎలా దోపిడీ చేయాలో ఐఏఎస్ అధికారులు నేర్పించారని అన్నారు. మర్ట్ గేజ్ ముసుగులో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ని దోపిడీ చేశారని విమర్శలు చేశారు.


డబ్బులు ఇస్తే కార్పొరేషన్‌లో ఏ తాకట్టు ఆస్తినైనా రిలీజ్ చేసేస్తారని ఆరోపించారు. 72 మార్టిగేజ్ రిలీజ్ చేయడం వలన రూ.65 కోట్లు కార్పొరేషన్‌కి నష్టం జరిగిందని చెప్పారు. ఇంకా వంద ఫైల్స్ ఉన్నాయని.. తాను డ్యాష్ బోర్డు ద్వారా తీసుకున్నానని తెలిపారు. కార్పొరేషన్‌లో అవినీతికి ప్రధాన కారణం ఐఏఎస్ అధికారులు హరిత, వికాస్ మార్మత్, అసిస్టెంట్ కమిషనర్ చిన్నడు ప్రధాన కారణమని ఆరోపణలు చేశారు. తప్పు చేసిన బిల్డర్ల మీద కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఉద్యోగి కాకపోయినా మార్టిగేజ్ రిలీజ్ చేశారన్నారు. రోడ్డున పోయేవాళ్లు సంతకం పెడితే రిజిస్ట్రషన్లు చేశారని వివరించారు.


దోపిడీకి పాల్పడిన దోపిడీదారులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణ చొరవ తీసుకోవాలని కోరారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. విచారణ అధికారి డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆనం వెంకటరమణారెడ్డికి దొరికిన ఆధారాలు డీఎస్పీకి దొరకలేదా? అని ప్రశ్నించారు. నెల్లూరు కార్పొరేషన్‌లో త్వరలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. వెంటనే కలెక్టర్ తనిఖీలు చేపట్టకపోతే కీలక ఆధారాలు అగ్నికి ఆహుతి అయిపోతాయని చెప్పారు.


మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంకా మంత్రిననే భ్రమలో నుంచిబయటకి రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.కాకాణి అనుమతులు లేకుండా తోడేరులో లే అవుట్ వేస్తే, అధికారులు చర్యలు తీసుకుంటే సోమిరెడ్డికి ఏం సంబంధమని నిలదీశారు. ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా పనులు చేసుకోవడం కాకాణికి అలవాటు అయిందని విమర్శించారు. ప్రభుత్వానికి డబ్బులు రావడం కాకణికి ఇష్టం లేదని చెప్పారు. కార్పొరేషన్ స్కామ్‌లో ఉన్న వైసీపీ నేతలు, ఐఏఎస్ అధికారులు, డీఎస్పీలని అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే, తానే స్వయంగా కేసులు పెడుతానని ఆనం వెంకటరమణా రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Updated Date - Aug 22 , 2024 | 12:36 PM