Nara Lokesh: ‘ప్రజాదర్బార్’ కు బారులు తీరుతున్న ప్రజలు..!
ABN , Publish Date - Jun 19 , 2024 | 01:02 PM
ప్రత్యేక యంత్రాంగంతో సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ కృషి చేశారు. వేకువజాము నుంచే ప్రజలు పెద్దఎత్తున బారులు తీరుతున్నారు. బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కు నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపిగ్గా లోకేష్ వింటున్నారు. ఆపై యంత్రాంగం ద్వారా ఆయా శాఖలకు పరిష్కారం కోసం రిఫర్ చేస్తున్నారు.
అమరావతి: ప్రత్యేక యంత్రాంగంతో సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ కృషి చేశారు. వేకువజాము నుంచే ప్రజలు పెద్దఎత్తున బారులు తీరుతున్నారు. బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కు నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపిగ్గా లోకేష్ వింటున్నారు. ఆపై యంత్రాంగం ద్వారా ఆయా శాఖలకు పరిష్కారం కోసం రిఫర్ చేస్తున్నారు. తన కుమార్తెకు వికలాంగ పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన కే.శ్రీలక్ష్మీ కోరారు. రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్ ను గత ప్రభుత్వం నిలిపివేసిందని, తిరిగి మంజూరు చేయాలని నవులూరుకు చెందిన రైతు వేమూరి విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
డిగ్రీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని మంగళగిరికి చెందిన షేక్ రెహ్మాన్ కోరారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ డబ్ల్యూఆర్ స్కూల్, కాలేజీల్లో పనిచేస్తున్న పార్ట్ టైం సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని సిబ్బంది కోరారు. వైసీపీ ప్రభుత్వం తొలగించిన 1800 మంది బీమా మిత్రలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని ఏపీఏసీటీపీఎల్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని ఏపీఎన్ఎస్ కమిటీ విజ్ఞప్తి చేసింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆయా సమస్యలను పరిష్కరిస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారు.