Nara lokesh: దైవంతో ఆటలోద్దు జగన్.. లోకేష్ హెచ్చరిక
ABN , Publish Date - Feb 26 , 2024 | 03:59 PM
Andhrapradesh: తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. నియంత పాలనలో నోరువిప్పడం నేరమే అంటూ విరుచుకుపడ్డారు. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్న అకృత్యాలను బయటపెట్టిన ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేయడం దారుణమన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 26: తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై (Rama Deekshitulu) టీటీడీ (TTD) వేటు వేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) స్పందించారు. నియంత పాలనలో నోరువిప్పడం నేరమే అంటూ విరుచుకుపడ్డారు. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్న అకృత్యాలను బయటపెట్టిన ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేయడం దారుణమన్నారు. కొండపై వైసీపీ నేతలు, కొంతమంది అధికారులు కలిసి చేస్తున్న దారుణాల గురించి ఆ కలియుగ దైవమే రమణ దీక్షితులు నోటి నుండి భక్తులకు తెలిసేలా చేశారన్నారు. చేసిన తప్పులు, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది పోయి రమణ దీక్షితులుపై కేసు పెట్టడం, అరెస్ట్ చెయ్యాలని చూడటం జగన్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. దేవుడి జోలికి వెళ్లిన వారు ఎవ్వరూ బాగుపడినట్టు చరిత్రలో లేదన్నారు. దైవంతో ఆటలోద్దు జగన్ అంటూ నారా లోకేష్ హెచ్చరించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...