Share News

Lokesh: పెత్తందారులెవరో అర్థమవుతోందా రాజా?!

ABN , Publish Date - Mar 21 , 2024 | 12:54 PM

Andhrapradesh: దెందులూరు నియోజకవర్గంలో బీసీ యువకులపై వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఆయన అనుచరులు చేసిన దాడిని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యువనేత నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఇటీవల పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమంటూ ప్రతిపక్షాలపై జగన్ అండ్ కో విమర్శలు గుప్పిస్తున్నారని.. దెందులూరులో జరిగిన ఘటనతో పెత్తందారులెవరో అర్థమవుతోందా రాజా? అంటూ ఎద్దేవా చేశారు.

Lokesh: పెత్తందారులెవరో అర్థమవుతోందా రాజా?!

అమరావతి, మార్చి 21: దెందులూరు నియోజకవర్గంలో బీసీ యువకులపై వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి (YSRCP MLA Abbayya Chaudhary), ఆయన అనుచరులు చేసిన దాడిని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యువనేత నారా లోకేష్ (TDP Leader Nara lokesh) తీవ్రంగా ఖండించారు. ఇటీవల పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమంటూ ప్రతిపక్షాలపై జగన్ అండ్ కో విమర్శలు గుప్పిస్తున్నారని.. దెందులూరులో జరిగిన ఘటనతో పెత్తందారులెవరో అర్థమవుతోందా రాజా? అంటూ ఎద్దేవా చేశారు. తనలో ఉన్న ఫ్యూడలిస్ట్ అవలక్షణాలన్నింటినీ ఎదుటివారికి అంటగట్టి బురదజల్లడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతోపెట్టిన విద్య అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కనీసం తమ ఎదుట నిలబడినా సహించలేని జగన్ అండ్ కో ఈ మధ్య పేదలకు, పెత్తందారులకు యుద్ధం అంటూ ప్రతిపక్ష నేతలపై ఎదురుదాడి చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

MLA Kannababu: వైసీపీ ఎమ్మెల్యే నోటి దురుసు.. రోడ్ల దుస్థితి బాగోలేదన్న వ్యక్తిపై..

‘‘దెందులూరు నియోజకవర్గం తిమ్మనగూడెంలో జగన్ సామంతరాజు, వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నిన్న ప్రచారానికి వెళ్లిన సమయంలో బీసీ యువకులు పిప్పర దుర్గాప్రసాద్, ఆయన స్నేహితులు పంచాయతీ బెంచ్‌పై కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారు. మేం ప్రచారానికి వస్తే లేచి నిలబడి గౌరవించకుండా దర్జాగా కూర్చుని చేతులు ఊపుతారా అంటూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కోపంతో ఊగిపోతూ విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. నాకు తెలిసి శతాబ్దాల క్రితం రాచరికంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితులు లేవు. ఎవరు అసలుసిసలైన పెత్తందారులో ఇప్పుడైనా అర్థమవుతోందా రాజా?! ’’ అంటూ లోకేష్ విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి..

Bode Prasad: కొడాలి నాని, వల్లభనేని వంశీతో నాకు ఎలాంటి సంబంధాలూ లేవ్..

Supreme Court: ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకంపై మేము జోక్యం చేసుకోం

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 21 , 2024 | 01:26 PM