Share News

Heavy Rains: విజయవాడలో 30 ఏళ్ల రికార్డ్ బ్రేక్

ABN , Publish Date - Sep 01 , 2024 | 12:43 PM

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎడ తెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడలో 30 ఏళ్లగా ఎన్నడూ లేనంతగా వర్షం కురిసింది. ఒకే రోజు 29 సెం. మీ వర్షపాతం నమోదయింది.

Heavy Rains: విజయవాడలో 30 ఏళ్ల రికార్డ్ బ్రేక్

విజయవాడ, సెప్టెంబర్ 01: ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎడ తెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడలో 30 ఏళ్లగా ఎన్నడూ లేనంతగా వర్షం కురిసింది. ఒకే రోజు 29 సెం. మీ వర్షపాతం నమోదయింది. గత రెండు రోజులుగా విజయవాడ మహానగరంలో కుండపోత వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఆటోనగర్, నుంచి బెంజ్ సర్కిల్ వరకు వరద నీరు భారీగా రహదారిపైకి వచ్చి చేరింది.

Also Read: Heavy rains: హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్


బుడమేరుకు వరద పోటు.. విజయవాడ నగరం అతలాకుతలం.. బుడమేరు వాగుకు వరద నీరు పోటెత్తింది. దీంతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. బుడమేరు వాగు పొంగి ప్రవహించడంతో.. నగరంలోని 16 డివిజన్లను వరద నీరు ముంచెత్తింది. విద్యాధరపురం, పాలప్రాజెక్టు, చిట్టినగర్, రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్‌లోని కాలనీల్లోని రహదారులు, నివాసాల్లోకి భారీగా వరద నీరు ప్రవేశించింది.

Also Read: Maha Vikas Aghadi: నేడు జోడి మారో ర్యాలీ.. స్పందించిన బీజేపీ

ఆరు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో.. పాయకాపురం, కండ్డ్రిక, రాజీవ్ నగర్ తదతర ప్రాంతాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. అయితే సహాయక చర్యలు సరిగ్గా లేవంటూ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు వరద పరిస్థితిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ, స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Also Read: Madhya Pradesh: రూ. 11 కోట్ల విలువైన యాపిల్ ఐఫోన్లు చోరీ


కొండ చరియలు విరిగిపడి..

అలాగే సున్నపు బట్టిల సెంటర్‌లో కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. అన్ని విధాలా ఆదుకుంటామని బాధితులకు ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని ఈ సందర్బంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎంపీ కేశినేని శివనాథ్‌, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: Haryana Assembly Elections: బీజేపీపై గెలుపునకు కాంగ్రెస్ వినూత్న ప్రచారం


కొండ చరియలు విరిగి పడి మరణించిన లక్ష్మీ అలియాస్ సత్యమ్మ భౌతిక కాయాన్ని ఎంపీ శివనాథ్ సందర్శించి.. నివాళులర్పించారు. కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాల్లోని శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులతోపాటు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఆహార పంపిణీ చేయాలని ఉన్నతాధికారులను ఎంపీ శివనాథ్ ఆదేశించారు.

Also Read: Mumbai Police: ఇరికిద్దామనుకున్నారు... ఇరుక్కుపోయారు..

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 01 , 2024 | 12:43 PM