Share News

CM Chandrababu: ఫుడ్‌పాయిజన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 22 , 2024 | 04:08 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ కేజీహెచ్‌‌‌ వెళ్లారు. ఈసందర్భంగా చిల్డ్రెన్ వార్డుకు వెళ్లిన సీఎం...కోటవురట్ల మండలం లోని కీలాసపట్నం అనాధాశ్రమంలో జరిగిన ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించారు. అనంతరం సీఎంకు ట్రైనీ డాక్టర్లు వినతిపత్రం అందజేశారు.

CM Chandrababu: ఫుడ్‌పాయిజన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

విశాఖపట్నం, ఆగస్టు 22: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) విశాఖపట్నం కేజీహెచ్‌‌‌ వెళ్లారు. ఈసందర్భంగా చిల్డ్రెన్ వార్డుకు వెళ్లిన సీఎం...కోటవురట్ల మండలంలోని కైలాసపట్నం అనాధాశ్రమంలో జరిగిన ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించారు. అనంతరం సీఎంకు ట్రైనీ డాక్టర్లు వినతిపత్రం అందజేశారు. వైద్యుల రక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎంను జూడాలు కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కలకత్తాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య ఘటన దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు బాధాకరమన్నారు.

CM Revanth Reddy: బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకొని రైతులు ఆగం కావద్దు: సీఎం


మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి అదే చివరి రోజు కావాలని హెచ్చరించారు. వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామన్నారు. కర్ణాటక మాదిరిగా కఠిన చట్టాలు తీసుకువస్తామని... ఇలాంటి ఘటనలు ఎవరూ ఉపేక్షించరని అన్నారు. ఇదే సమయంలో ఆందోళనలు చేస్తున్న ట్రైనీ డాక్టర్లు రోగులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.


అచ్యుతాపురం బాధితులకు అండగా ఉంటానన్న సీఎం...

అంతకు ముందు.. అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితులను మెడికవర్‌ ఆస్పత్రిలో సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అన్నివిధాలా చూసుకుంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. ఎంత ఖర్చు అయినా రక్షించుకుంటామని హామీ ఇచ్చారు. తాము అండగా ఉంటామని.. ధైర్యంగా ఉండాలని బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యం చెప్పారు. అవసరమైన వారికి ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయిస్తామని అన్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే, మెడికవర్‌ ఆస్పత్రి దగ్గర సీఎం చంద్రబాబు భావోద్వేగం అయ్యారు.

Kolkata Doctor Case: బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం.. మూడు దశాబ్ధాల్లో ఇలాంటి కేసు చూడలేదన్న న్యాయమూర్తి..



ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 17 మంది మృతి, 36 మందికి గాయాలయ్యాయాని అధికారులు చంద్రబాబుకు వివరించారు. 10 మందికి తీవ్రగాయాలు, 26 మందికి స్వల్పగాయాలు అయ్యాయని తెలిపారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించారు. తీవ్ర గాయాలైనవారికి రూ.50 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.


ఇవి కూడా చదవండి...

CM Chandrababu: విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం చంద్రబాబు

Botsa: అచ్యుతాపురం ఘటన బాధాకరం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 22 , 2024 | 04:11 PM