Share News

Home Minister Anita: అనాగరికంగా హత్య చేశారు..

ABN , Publish Date - Aug 14 , 2024 | 01:48 PM

విశాఖపట్నం: హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం బెల్లం వినాయకున్ని, సంపత్ వినాయకున్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రిని మీడియా పలుకరించగా.. కర్నూలు టీడీపీ నేత శ్రీను హత్యపై స్పందించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు రాజకీయ హత్యలు జరిగాయని, అందులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలు హత్యకు గురయ్యారని, అనాగరికంగా హత్య చేశారని అన్నారు.

Home Minister Anita: అనాగరికంగా హత్య చేశారు..

విశాఖపట్నం: హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anita) బుధవారం బెల్లం వినాయకున్ని, సంపత్ వినాయకున్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రిని మీడియా పలుకరించగా.. కర్నూలు టీడీపీ నేత (Kurnool TDP Leader) శ్రీను (Srinu) హత్య (Murder)పై స్పందించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి (TDP Kutami) అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు రాజకీయ హత్యలు జరిగాయని, అందులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలు హత్యకు గురయ్యారని, అనాగరికంగా హత్య చేశారని అన్నారు. కర్నూలు ఎస్పీతో ఫోన్లో మాట్లాడానని, నిందితుల్ని పట్టుకుని చట్ట ప్రకారం శిక్షింస్తామని చెప్పారు.


నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని హోంమంత్రి అనిత తెలిపారు. మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. వైసీపీ నాయకులను చంపేస్తున్నారని జగన్ గగ్గోలు పెడుతున్నారని, ఈరోజు అధికార పార్టీకి చెందిన నాయకుడు హత్యకు గురయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు కావాలనే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సరిగా లేదని క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. హత్య చేసిన నిందితులను ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


వైసీపీ ఎమ్మెల్సీల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని, పెద్దల సభకు మచ్చ తెచ్చే విధంగా కొంతమంది ఎమ్మెల్సీల ప్రవర్తన ఉందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ను చంపేసి డోర్ డెలివరీ చేశారని, అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించలేదని ఆరోపించారు. ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండవలసిన ప్రజాప్రతినిధులు రోడ్లుపైకి వచ్చి రచ్చ చేస్తున్నారని. ఎమ్మెల్సీలుగా పంపించే వ్యక్తుల కోసం ఆ పార్టీ నాయకులు, అధిష్టానం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎంతోమంది త్యాగాలు, పోరాటాలు ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని.. స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపైన ఉందన్నారు.


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) 2047 విజయంతో ముందుకు వెళ్తున్నారని, గతంలో విజన్ 2020 తీసుకువచ్చి సక్సెస్ అయ్యారని హోంమంత్రి అనిత అన్నారు. రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లాలని చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని, విజన్ 2047 రాష్ట్ర దేశ భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా మారబోతుందని హోంమంత్రి పేర్కొన్నారు.


కాగా పత్తికొండ మండలం హోసూరులో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యాడు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఊరి బయట కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవళ్లతో దుండగులు నరికి చంపేశారు. సార్వత్రిక ఎన్నికల్లో హోసూరు గ్రామంలో టీడీపీకి భారీ మెజార్టీ తేవడంతో వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక పోయారు.

ఏపీలో టీడీపీ కూటమి దాదాపు అన్ని చోట్ల భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ విజయానికి చాలా మంది నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కృషి చేశారు. వైసీపీ ఆగడాల కారణంగా విసిగిపోయిన ప్రజానీకమంతా కూటమికి మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలోనే హోసూరు గ్రామంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి భారీ మెజార్టీ వచ్చింది. ఈ విషయాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలు జరిగి రెండు నెలలు అవుతున్నా కానీ వారిలోని ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. హోసూరులోనూ టీడీపీకి భారీ మెజారిటీ వచ్చింది. దీంతో తమ గ్రామంలో భారీ మెజారిటీ రావడానికి శ్రీనివాసులే కారణమని భావించారు. సమయం చూసి బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఊరి బయట కంట్లో కారం కొట్టి వేట కొడవళ్లతో దారుణాతి దారుణంగా నరికి చంపేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు..?

జగనన్న లేఅవుట్లలో విజిలెన్స్ తనిఖీలు..

ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరేయాలి..

9 రాష్ట్రాల NSUI అధ్యక్షుల ప్రకటన

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 14 , 2024 | 01:52 PM