Kandula Durgesh: త్వరలోనే నూతన టూరిజం పాలసీ
ABN , Publish Date - Oct 25 , 2024 | 02:58 PM
Andhrapradesh: రాష్ట్రంలో నూతన టూరిజం పాలసీపై టూరిజం మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టూరిజంకు పారిశ్రామిక హోదా ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం పర్యాటకంగా నష్టపోయిందని విమర్శించారు.
విశాఖపట్నం, అక్టోబర్ 25: కూటమి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో టూరిజం నూతన పాలసీ సిద్ధమవుతుందని టూరిజం మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) వెల్లడించారు. శుక్రవారం సీఐఐ టూరిజం అండ్ ట్రావెల్స్ సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఏపీలో (Andhrapradesh) టూరిజంకు పారిశ్రామిక హోదా ఇస్తామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం పర్యాటకంగా నష్టపోయిందని విమర్శించారు.
Tirumala: శారదా పీఠం అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం
పర్యాటకం పడకేసిన సందర్భం గత ప్రభుత్వంలో చోటు చేసుకుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం పర్యాటకానికి పెద్ద పీట వేస్తుందని స్పష్టం చేశారు. పర్యటక కోసం స్వదేశీ, ప్రసాద్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహకారం ఇస్తుందన్నారు. విశాఖలో షూటింగ్స్ కోసం సింగిల్ విండో సిస్టం తీసుకొస్తామన్నారు. రుషికొండ భవనాలను ఏం చేయాలో అన్నదానిపై నెల రోజుల్లో కొలిక్కి వస్తుందన్నారు. అవినీతికి కెరాఫ్ అడ్రస్‌గా చూపుతూ రుషికొండ భవనాలను మ్యూజియం చేయాలన్నారు. ఈసారి బీచ్ పెస్టివల్స్ జనవరిలో నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
మాకు రెండు రాష్ట్రాలు ముఖ్యం: నిర్మాత సురేష్
సిని పరిశ్రమ విశాఖకు రావడం కంటే ఇక్కడ లోకల్ టాలెంట్‌ను పోత్సాహించడం అవసరమని సినీ నిర్మాద దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు. సినిమా తీరు ఇప్పుడు పూర్తిగా మారిపోయిందన్నారు. ఎక్కడ నుంచైనా సినిమా తీయవచ్చని తెలిపారు. సోషల్ మీడియా ప్రభావం సినిమా మీద విపరితంగా ఉందన్నారు. చైన్నై నుంచి హైదరాబాద్‌కు అతికష్టం మీద తరలివచ్చామని చెప్పారు. ఇప్పుడు తమకు రెండు రాష్ట్రాలు ముఖ్యమని స్పష్టం చేశారు.
YS Jagan vs YS Sharmila: వైఎస్ఆర్ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ..
మనం తీసేది తెలుగు సినిమా కాబట్టి ఎక్కడ తీసిన ఒక్కటే అని .. అక్కడ ఇక్కడ ఉన్నది తెలుగు వాళ్లే అని అన్నారు. సిని టూరిజాన్ని అభివృద్ది చేయాలన్నారు. మనకు చాల వనరులు ఉన్నప్పటికీ వచ్చే టూరిస్టులు మాత్రం తక్కువన్నారు. ఫ్రెండ్లీ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. కట్టడి లేకుండా టూరిస్టులుకు స్వేచ్ఛ ఇవ్వాలని.. అప్పుడే టూరిజం అభివృద్ధి చెందుతుందని నిర్మాత సురేష్ బాబు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, నిర్మాత దగ్గుబాటి సురేష్‌తో పాటు టూర్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Telangana: కేటీఆర్ పరువు నష్టం కేసులో మంత్రి సురేఖకు షాక్..
AP Govt: విజయవాడ వరద బాధితులకు పరిహారం విడుదల..
Read Latest AP News And Telugu News