Share News

Ram Prasad Reddy: పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా తయారైంది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ABN , Publish Date - Jun 30 , 2024 | 04:08 PM

విశాఖ: రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా తయారైందని ఆంధ్రప్రదేశ్ రవాణా, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి(Minister Ram Prasad Reddy) అన్నారు. రాష్ట్రంలో అత్యంత ఎక్కువ ఖనిజ సంపద కొలగొట్టింది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే (Peddireddy Family) అని ఆయన ఆరోపించారు.

Ram Prasad Reddy: పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా తయారైంది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

విశాఖ: రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా తయారైందని ఆంధ్రప్రదేశ్ రవాణా, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ram Prasad Reddy) అన్నారు. రాష్ట్రంలో అత్యంత ఎక్కువ ఖనిజ సంపద కొలగొట్టింది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే (Peddireddy Family) అని ఆయన ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి(MP Midhun Reddy) తనపై అవాకులు చవాకులు పేలితున్నారంటూ మంత్రి మండిపడ్డారు. ఏపీలో ఏదో అన్యాయం జరిగినట్లు, ఎక్కడో భూకంపం వచ్చినట్టు మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.."మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు లేసులు కట్టిన వ్యక్తి మిథున్ రెడ్డి. అలాంటి వ్యక్తులు నాపై కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో 5సంవత్సరాల పాపాలకు నేడు వాళ్ల కళ్లల్లో రక్తం వస్తోంది. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బినామీగా ఉంటూ మొన్న ఏపీ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టింది ఎవరో అందరికీ తెలుసు. రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా మారింది. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల చరిత్ర గురించి అందరికీ తెలుసు. వారు చేసిన అన్యాయాలపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం" అని మంత్రి హెచ్చరించారు.


ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు విషయంపై పూర్తి అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. లోపాలను సరిదిద్ది ఎన్నికల హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఆర్టీసీ ప్రక్షాళన సైతం జరుగుతుందని, రాబోయే కాలంలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో క్రీడా సంఘాల అవకతవకలపైనా దృష్టిపెట్టి వాటి అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

ఇది కూడా చదవండి:

Pawan kalyan: రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీ అయ్యాయంటూ డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు..

Updated Date - Jun 30 , 2024 | 04:13 PM