Share News

AP Tourism: తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజ్

ABN , Publish Date - Jul 17 , 2024 | 10:11 AM

Andhrapradesh: తిరుమల శ్రీవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివితీరదు.శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు. ఆ గోవిందుడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటారు. అలాగే తిరుమలకు కొందరు సొంత వాహనాల్లో వెళ్తుండగా మరికొందరు రైలును, విమానాలను ఆశ్రయిస్తుంటారు. ఇదిలా ఉండగా విశాఖ నుంచి తిరుమల భక్తులకు కోసం ఏపీ పర్యాటక శాఖ బంపారఫ్ ప్రకటించింది.

AP Tourism: తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజ్
Tirumala

విశాఖపట్నం, జూలై 17: తిరుమల (Tirumala) శ్రీవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివితీరదు. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు. ఆ గోవిందుడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటారు. అలాగే తిరుమలకు కొందరు సొంత వాహనాల్లో వెళ్తుండగా మరికొందరు రైలును, విమానాలను ఆశ్రయిస్తుంటారు. ఇదిలా ఉండగా విశాఖ నుంచి తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఏపీ పర్యాటక శాఖ బంపారఫ్ ప్రకటించింది. తిరుమల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని సిద్ధం చేసింది.

Chandrababu: అదుపు తప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అమిత్ షాకు వివరించా..


ప్రతీ రోజు మధ్యాహ్నం నుంచి తిరుమలకు వెళ్లేందుకు ఏసీ బస్సులను రెడీ చేసింది. ఈనెల 19 నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులోకి రానుంది. ఈ నెల 19 నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఏసీ బస్సు బయలుదేరుతుంది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి, శ్రీ కాళహస్తి మీదుగా తిరుపతికి బస్సు వెళ్లనుంది. స్వామి వారి దర్శనం, పద్మావతి అమ్మవారి దర్శనం అనంతరం విశాఖకు తిరుగు ప్రయాణం అవనుంది. ఇందుకు గాను పర్యాటన శాఖ ప్రత్యేక ధరలను నిర్ణయించింది. పెద్దలకు రూ. 6,300, పిల్లలకు రూ. 6,000 గా టికెట్ ధరను నిర్ణయించింది. సో.. తిరుమలకు వెళ్లాలనుకునే విశాఖ వాసులు, ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుని శ్రీనివాసుడిని దర్శించుకోండి మరి.


ఇవి కూడా చదవండి...

Viral Video: కన్యాదానం అసలు ప్రాముఖ్యతను వివరించిన నీతా అంబానీ

అమరావతికి మూడు రాచబాటలు!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 17 , 2024 | 11:08 AM