AP Politics:చంద్రబాబుపై ప్రశంసలు.. జగన్‌పై విమర్శలు.. స్వరం మార్చిన వైసీపీ నేతలు..
ABN , Publish Date - Aug 21 , 2024 | 05:31 PM
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలకు అసలు విషయం తెలిసొచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించిన నేతలు ప్రస్తుతం స్వరం మార్చారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలకు అసలు విషయం తెలిసొచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించిన నేతలు ప్రస్తుతం స్వరం మార్చారు. పరిపాలనలో చంద్రబాబు ఎంతో అనుభవం ఉన్న నాయకుడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు జగన్‌ను ఓ రేంజ్‌లో పొగిడిన నేతలు ఇప్పుడు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. కొందరు నేతలైతే జగన్‌కు గుడ్‌బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటే.. మరికొందరు పార్టీలో ఉంటూనే సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు పరిమితులకు మించి వ్యవహరించారని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కనీసం ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు కాకుండానే తొందరపడి విమర్శలు చేయడం సరికాదంటూ వైసీపీ అధినేత తీరును కొందరు నాయకులు ఖండిస్తున్నారు. ఇలా అధికారం దూరమైన తర్వాత వైసీపీ నేతల తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోందట. వైసీపీ ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపిస్తే చాలు.. అవతలి వ్యక్తులను టార్గెట్ చేసిన నేతలు.. అవ్వన్నీ కక్ష సాధింపులో భాగంగా చేసినవేనని ఒప్పుకుంటున్నారు. మొత్తానికి అధికారం మారడంతో నేతల స్వరం కూడా మారిందనే చర్చ సాగుతోంది.
Purandeshwari: లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ముందుకు అడుగులు..
చంద్రబాబుపై..
అధికారం కోల్పోయిన తర్వాత తమకు అసలు విషయం అర్థమైందని మనసులో మాట బయటపెట్టారు విశాఖపట్టణం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చంద్రబాబు పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడని ఒప్పుకున్నారు. ఆయన కష్టపడే మనిషని.. దీనిని ఎవరైనా ఒప్పుకోవాలన్నారు. 24 గంటలు కష్టపడతారన్నారు. పని బాగా చేస్తారని, చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని ఎంవీవీ పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ సహకారం ఉండటంతో ఏపీని మరింత బాగా అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయనకు ఉన్న పాలనా అనుభవం ఉపయోగించి పారిశ్రమలను రాష్ట్రానికి తీసుకురాగల సామర్థ్యం ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేస్తే మరింత బాగుంటుందని ఎంవీవీ అభిప్రాయపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును తీవ్రస్థాయిలో విమర్శించిన నేతలు.. ఒక్కసారిగా స్వరం మార్చి వాస్తవాలు ఒప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Nara Lokesh: బాబు కాదు.. ఢిల్లీలో ఇకపై చక్రం తిప్పేది చినబాబేనట..!!
వైసీపీ పాలనపై..
2020 నుంచి 2022 వరకు విశాఖపట్టణంలో చీకటి పాలన సాగినట్లు అనిపిస్తుందని ఎంవీవీ పేర్కొన్నారు. నేరుగా పేరు ప్రస్తావించకపోయినా పరోక్షంగా విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో అందరినీ ఇబ్బందులు పెట్టేవారన్నారు. విజయసాయిరెడ్డిని విశాఖ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత తాము కొంత ఊపిరిపీల్చుకున్నట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి అరాచకాల కారణంగా స్థానికంగా తనతో పాటు ఎంతోమంది నాయకులు తీవ్ర ఇబ్బందులు పడినట్లు ఎంవీవీ తెలిపారు. దీంతో విజయసాయిరెడ్డి అక్రమాలపై సొంతపార్టీ నేత పెదవి విప్పడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వం విజయసాయి అక్రమాలపై విచారణ చేసి.. ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచిచూడాలి మరి.
Rajendraprasad: పంచాయతీల అభివృద్ధికి రూ.900 కోట్లు జమ చేయడంపై వైవీబీ హర్షం
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News