AP Politics: వైసీపీకి ఎదురుదెబ్బ.. జనసేనలోకి బొత్స..
ABN , Publish Date - Sep 25 , 2024 | 05:48 PM
బొత్స సత్యనారాయణ ఏ పార్టీలో ఉన్నా ఆ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఉండేది. కుటుంబ సభ్యులకు అవసరమైన పదవులను దక్కించుకునేవారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం తన కుటుంబానికి ..
వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒక్కో నేత పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2024 ఎన్నికల వరకు బొత్స కుటుంబం అధిపత్యంలో ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. శాసనమండలిలో ఆ పార్టీ పక్ష నేత బొత్స సత్యానారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు వైసీపీని వీడి జనసేనలో చేరనున్నారు. బొత్స సత్యనారాయణ ఏ పార్టీలో ఉన్నా ఆ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఉండేది. కుటుంబ సభ్యులకు అవసరమైన పదవులను దక్కించుకునేవారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం తన కుటుంబానికి అధికంగానే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు లభించాయి. బొత్స సత్యనారాయణతో పాటు ఆయన భార్యకు విశాఖ ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. ఆయన ఇద్దరు సోదరులతో పాటు మేనల్లుడికి టికెట్లు దక్కించుకోగలిగారు. ఐదుగురిలో ఎవరూ గెలుపొందలేదు. దీంతో విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ అధిపత్యం తగ్గిందనే ప్రచారం జోరుగా సాగింది.
Chandrababu: బోట్ల ఘటన.. కచ్చితంగా వైసీపీ కుట్రే
ఉత్తరాంధ్రా రాజకీయాల్లో..
బొత్స సత్యనారాయణకు ఉత్తరాంధ్రా రాజకీయాలపై పట్టు ఉండటంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా ఆ ప్రాంతంలో బలమైన వ్యక్తి కావడంతో ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ బొత్స సత్యనారాయణను ప్రకటించింది. టీడీపీ కూటమి నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి విశాఖపట్టణం నుంచి ఎమ్మెల్సీ ఇవ్వడంపై పార్టీలో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ వైసీపీ అధ్యక్షులు జగన్ బొత్సకు ప్రాధాన్యత ఇచ్చారు. తాజాగా బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు వైసీపీని వీడాలని నిర్ణయించుకోవడం ఉత్తరాంధ్రా రాజకీయాల్లో సంచలనంగా మారింది. బొత్స కుటుంబానికి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. మొదటి నుంచి కుటుంబం మొత్తం ఒకే మాట మీద ఉంటుంది. బొత్స సత్యనారాయణ ఏది చెబితే అదే ఫైనల్. దీనిలో భాగంగా కుటుంబసభ్యులందరికీ రాజకీయ, వ్యాపార అవకాశాలు ఇప్పించడంలో బొత్స సత్యనారాయణ ముందు వరుసలో ఉండేవారు. అయినప్పటికీ లక్ష్మణరావు జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
AP Govt: వరద బాధితులకు ప్రభుత్వం అందించిన నష్ట పరిహార వివరాలు ఇవే
తగ్గుతున్న అధిపత్యం..
విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ అధిపత్యం తగ్గుతుందనడానికి కుటుంబంలో నెలకొన్న విబేధాలే నిదర్శనంగా చెబుతున్నారు. కొంతకాలంగా బొత్స సత్యనారాయణ వైఖరిపై లక్ష్మణరావు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో బొత్స విజయం కోసం లక్ష్మణరావు పనిచేయలేదనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత బొత్స కుటుంబంలో ఎవరూ విజయం సాధించలేదు. బొత్స అడ్డాలో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. బొత్స పార్టీలో యాక్టివ్‌గా ఉండేందుకు ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయినప్పటికీ ఆయన ఇటీవల కాలంలో పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి మమ అనిపిస్తున్నారు. బొత్స సత్యనారాయణ తీరుతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సైతం వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా లక్ష్మణరావు వైసీపీని వీడి జనసేనలో చేరాలని నిర్ణయించుకోవడంతో.. ఆయనతో పాటు మరికొందరు స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా వైసీపీని వీడి జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా లక్ష్మణరావు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిని కలిసి జనసేనలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో బొత్స లక్ష్మణరావు జనసేనలో చేరనున్నారు.
AP Politics: వైసీపీకి మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here