Share News

DSP Sravan Kumar: వివాహితపై అత్యాచారయత్నం చేసిన ముగ్గురి అరెస్టు..

ABN , Publish Date - Aug 18 , 2024 | 08:44 PM

ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డిఎస్పీ హెచ్చరించారు.

DSP Sravan Kumar: వివాహితపై అత్యాచారయత్నం చేసిన ముగ్గురి అరెస్టు..

ఏలూరు: ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డిఎస్పీ హెచ్చరించారు. ఈనెల 17న అర్ధరాత్రి మద్యం సేవించిన ముగ్గురు యువకులు మహిళపై అత్యాచారయత్నం చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్టు చేసినట్లు డిఎస్పీ వెల్లడించారు.


ఈ సందర్భంగా డిఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. " చింతలపూడి మండలం ధర్మాజీగూడెంకు చెందిన మహిళ భర్త చనిపోవడంతో గత కొన్ని రోజులుగా మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే పొట్టుకూటి కోసం వీరిద్దరూ పది రోజుల క్రితం ఏలూరు నగరానికి వచ్చారు. హోటళ్లు, ఇతర ప్రదేశాల్లో పని చేస్తూ జీవిస్తున్నారు. నగరానికి కొత్తగా రావడంతో వారికి ఇంకా ఇళ్లు అద్దెకు దొరకలేదు. దీంతో వారు ఒకటో పట్టణ పరిధిలోని దేవాలయం ఆవరణలో ఉంటున్నారు. ఈనెల 17న రాత్రి నూతిపల్లి పవన్‌, నారపాటి నాగేంద్రబాబు, విజయ్ కుమార్‌ అనే ముగ్గురు వ్యక్తులు వారి వద్దకు వెళ్లారు. వారితో మాటలు కలిపి మహిళతో సహా అందరూ మద్యం తాగారు.


అనంతరం ఆమె భర్త నిద్రలోకి జారుకోగానే ఆమెను పక్కకు తీసుకెళ్లారు. వివాహితపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె కేకలు విన్న భర్త, మరో స్థానికుడు ఆమెను కాపాడేందుకు వెళ్లడంతో నిందితులు పారిపోయారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్నాం. ఆమె వెంటనే ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించాం. ఘటనపై కేసు నమోదు చేసిన ఒకటో పట్టణ ఎస్సై లక్ష్మణ్‌ గంటల వ్యవధిలోనే ముగ్గురినీ అరెస్టు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. అయితే పోలీసులు సమయానికి స్పందించలేదని వస్తున్న ఆరోపణలు అవాస్తవం" అని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: తిరుపతి జిల్లాకు సీఎం చంద్రబాబు.. శ్రీసిటీలో పర్యటన..

CPI Narayana: ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని మోదీ ఇబ్బందులు పెడుతున్నారు..

Updated Date - Aug 18 , 2024 | 08:45 PM