AP Politics: జనసేనలోకి బాలశౌరి, ఖరారైన ముహూర్తం.. ఎప్పుడంటే..?
ABN , Publish Date - Jan 30 , 2024 | 09:25 AM
సొంత పార్టీ వైఎస్ఆర్ సీపీపై అసంతృప్తితో ఉన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరే ముహూర్తం ఖరారయ్యింది. ఫిబ్రవరి 4వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరతారు.
అమరావతి: సొంత పార్టీ వైఎస్ఆర్ సీపీపై అసంతృప్తితో ఉన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి (Balashowry) జనసేన పార్టీలో చేరే ముహూర్తం ఖరారయ్యింది. ఫిబ్రవరి 4వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరతారు. బాలశౌరికి పవన్ కల్యాణ్ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలుకుతారు. వైసీపీలో పేర్ని నానితో బాలశౌరికి విభేదాలు వచ్చాయి. మచిలీపట్నం ఎంపీగా తనకు ప్రోటోకాల్ పాటించడం లేదని పలు సందర్భాల్లో చెప్పారు. ఇదే విషయం సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకొచ్చారు. పేర్ని నాని ఇష్యూలో సీఎం జగన్ స్పందించలేదు. అలాగే వచ్చే లోక్ సభ టికెట్ కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. తనకు తెలియకుండానే మరొకరికి టికెట్ కేటాయించారని బాలశౌరి ఆగ్రహంగా ఉన్నారు. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తీరుతో విసిగిపోయి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేన పార్టీ నుంచి మచిలీపట్నం లోక్ సభ అభ్యర్థిగా బాలశౌరి బరిలో దిగే అవకాశం ఉంది. టికెట్‌పై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చిన తర్వాత చేరాలని నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ సమచారం.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.