Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:25 PM
మంచి చదువు, ఉద్యోగాలను వదిలిపెట్టి ఓ యువకుడు తక్కువ వయస్సులోనే ఓ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అప్పుడు జాబ్ వదిలేసిన సమయంలో ఆయనను విమర్శలు చేసిన అనేక మంది ఇప్పుడు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అయితే అసలు ఆయన ఏం చేశారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
చాలా మందికి వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది. కానీ కొంత మంది మాత్రమే ధైర్యం చేసి ముందడుగు వేస్తారు. అలాంటి వారిలో ఓ యువకుడు కూడా ఇటివల చేరాడు. అంతటితో ఆగకుండా ఇప్పుడు వేల కోట్ల సంపదకు వారసుడిగా నిలిచాడు. ఆయనే ఆదిత్ పాలిచా(Aadit Palicha) జెప్టో(Zepto) సహ వ్యవస్థాపకుడు. ఆదిత్ ఈ కంపెనీని ప్రారంభించడానికి ముందు తన చదువును మధ్యలోనే వదిలేశాడు. కానీ ఇప్పుడు మాత్రం రూ. 4,300 కోట్ల నికర విలువతో 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో రెండో అతి పిన్న వయస్కుడిగా ఘనతను సాధించాడు.
జెప్టో మార్కెట్ విలువ
అమెరికాకు వెళ్లే ముందు, ఆదిత్ పాలిచా తన 17 సంవత్సరాల వయస్సులో తన స్టార్టప్, గోపూల్‌తో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించాడు. అయితే గోపూల్ ప్రత్యేకంగా ఏమీ అభివృద్ధి చెందలేదు. ఆ తర్వాత పాలిచా మరోసారి చదువు వైపు దృష్టి సారించాడు. ఆ సమయంలో ఆయన వోహ్రాతో కలిసి సుమారు 10 నెలల పాటు నడిచిన కిరానాకార్ట్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. కానీ వారు కంపెనీని మూసివేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొత్త మెరుగైన బ్రాండ్ Zepto (2021లో)తో తిరిగి మార్కెట్లోకి వచ్చారు. ఇప్పుడు జెప్టో మార్కెట్ విలువ 5 బిలియన్ డాలర్లు (రూ. 4,21,92,31,25,500) ఉండటం విశేషం.
చదువును మధ్యలోనే
పట్టణ ప్రపంచంలో నివసించే అనేక మందికి సమయాన్ని ఆదా చేయడానికి జెప్టో ఇప్పుడు ఒక అవకాశంగా మారింది. దీని ద్వారా మీ ఇంట్లో ఏ వస్తువునైనా నిమిషాల్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ కంపెనీని స్థాపించిన ఆదిత్ పాలిచా జెప్టో సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఆదిత్ పాలిచా 2001లో ముంబైలో జన్మించారు. ఆయన కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ సంపాదించడానికి స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. కానీ అతను తన చదువును మధ్యలోనే వదిలేసి తన సొంత పనిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో కైవల్య వోహ్రాతో కలిసి జెప్టోను ప్రారంభించారు. కైవల్య వోహ్రా కూడా అదిత్‌తో పాటు చదువును మధ్యలోనే వదిలేశారు.
అతి చిన్న వ్యాపారవేత్త
జెప్టో సహ వ్యవస్థాపకుడు ఆదిత్ పాలిచా (22) ప్రస్తుతం భారతదేశపు రెండో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచాడు. అతని సహచరుడు కైవల్య వోహ్రా (21) నంబర్ వన్‌లో ఉన్నాడు. ఆదిత్ ఆస్తుల విలువ రూ.4,300 కోట్లు. కాగా కైవల్య వోహ్రా నికర విలువ గురించి మాట్లాడితే అది రూ. 3,600 కోట్లు. ఇషా, ఆకాష్, అనంత్, అదానీల పిల్లల పేర్లు కూడా బిలియనీర్ల జాబితాలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
Chrome Browser: గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను సేల్ చేస్తున్నారా.. అమెరికా ప్రభుత్వం..
PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More Business News and Latest Telugu News