Share News

EPFO Withdrawal Rule: పీఎఫ్ విత్ డ్రా రూల్స్ మారాయ్.. వెంటనే చెక్ చేసుకోండి!

ABN , Publish Date - Jun 15 , 2024 | 10:41 AM

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతా నుంచి మీరు నగదు విత్ డ్రా(cash Withdraw) చేయాలని చూస్తున్నారా. అయితే ఓసారి మారిన కొత్త నిబంధనల గురించి తెలుసుకోండి. ఈ రూల్ గురించి తెలుసుకోకుంటే మీరు విత్ డ్రా చేసే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

EPFO Withdrawal Rule: పీఎఫ్ విత్ డ్రా రూల్స్ మారాయ్.. వెంటనే చెక్ చేసుకోండి!
EPFO withdrawal rule change

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతా నుంచి మీరు నగదు విత్ డ్రా(cash Withdraw) చేయాలని చూస్తున్నారా. అయితే ఓసారి మారిన కొత్త నిబంధనల గురించి తెలుసుకోండి. ఈ రూల్ గురించి తెలుసుకోకుంటే మీరు విత్ డ్రా చేసే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక మారిన కొత్త రూల్ ఏంటంటే కరోనా సమయంలో కోవిడ్-19కి సంబంధించి EPF సభ్యులు అడ్వాన్స్ మొత్తాన్ని 75 శాతం తీసుకునేందుకు ఒక నిబంధన ఉండేది.

కోవిడ్ సమయంలో ఉద్యోగ నష్టం, జీతంలో కోత వంటి సమస్యలను ఎదుర్కొన్న సభ్యులకు ఇది ప్రయోజనం చేకూర్చింది. ఇప్పుడు కోవిడ్ మహమ్మారి ప్రభావం లేనందువల్ల అడ్వాన్స్ మొత్తం తీసుకునే అవకాశాన్ని నిలిపివేసినట్లు నిర్ణయించారు. ఇది ట్రస్ట్‌లకు కూడా వర్తిస్తుందని ప్రకటించారు.


EPFO నిబంధనల ప్రకారం సభ్యులు తమ ప్రాథమిక జీతం పొందిన మొత్తాన్ని మూడు రెట్లు లేదా వారి ఖాతాలో అందుబాటులో ఉన్న మొత్తంలో 75 శాతం (EPFO 75 శాతం క్లెయిమ్) విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఇవ్వబడింది. దీని కంటే తక్కువ మొత్తాన్ని కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ క్రమంలో మీరు ఇంటి కొనుగోలు, గృహ రుణం, వివాహం లేదా విద్య కోసం ముందస్తు మొత్తాన్ని తీసుకోవడం ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.

మరోవైపు ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద EPF ఖాతాల నుంచి నగదును విత్‌డ్రా చేసుకునే సదుపాయం మొదటిసారిగా మార్చి 2020లో మార్పు చేయబడింది. దీని తర్వాత జూన్ 2021లో EPF సభ్యుల ఖాతాల నుంచి తిరిగి చెల్లించలేని అడ్వాన్స్‌ను ఇవ్వాలని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో EPFO ఉపసంహరణ కోసం ఈ వెబ్‌సైట్ https://www.epfindia.gov.in/site_en/index.php క్లిక్ చేసి అప్లై చేయండి.


ఇది కూడా చదవండి:

Gold and Silver Rate: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఈసారి ఎంతంటే..


MalliKarjun Kharge: నీట్‌ మార్కులు, ర్యాంకులపై సర్కార్‌ రిగ్గింగ్‌

Kishan Reddy: వచ్చే వారం బొగ్గు గనుల వేలం


For Latest News and Business News click here

Updated Date - Jun 15 , 2024 | 11:01 AM