Share News

Investment: లక్ష పెట్టుబడితో రూ. 46 లక్షలు పొందొచ్చు.. అదెలాగంటే..

ABN , Publish Date - Jul 01 , 2024 | 01:01 PM

Sukanya Samriddhi Yojana: సాధారణంగా సగటు మధ్యతరగతి కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందంటే చాలు.. ఆ తల్లిదండ్రులు అమ్మాయి చదువు, పెళ్లి తదితర ఖర్చుల విషయంలో ఆందోళనగా ఉంటారు. అందుకే.. బిడ్డ భవిష్యత్ కోసం లెక్కలేసుకుని ఏం చేయాలా? అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి ఆందోళనలను దూరం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది.

Investment: లక్ష పెట్టుబడితో రూ. 46 లక్షలు పొందొచ్చు.. అదెలాగంటే..
Sukanya Samriddhi Yojana Scheme

Sukanya Samriddhi Yojana: సాధారణంగా సగటు మధ్యతరగతి కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందంటే చాలు.. ఆ తల్లిదండ్రులు అమ్మాయి చదువు, పెళ్లి తదితర ఖర్చుల విషయంలో ఆందోళనగా ఉంటారు. అందుకే.. బిడ్డ భవిష్యత్ కోసం లెక్కలేసుకుని ఏం చేయాలా? అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి ఆందోళనలను దూరం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అలాంటి పథకాల్లో కీలకమైంది.. సుకన్య సమృద్ధి యోజన పథకం(SSY). ఇది చిన్న పొదుపు పథకం. పన్ను ఆదాతో పాటు మంచి రాబడిని అందిస్తుంది. ఈ పథకంలో అమ్మాయి పుట్టినప్పటి నుంచి సంవత్సరానికి రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టడం ద్వారా 21 సంవత్సరాలకు భారీ మొత్తంలో డబ్బు అందుకుంటారు. సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..


వడ్డీ ప్రయోజనం..

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పథకం కింద డిపాజిట్లపై 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇటీవల ప్రభుత్వం జూలై, సెప్టెంబర్ మధ్య చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రకటించింది. అయితే, ఈ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. SSY పథకం కింద.. ప్రతి ఖాతాదారుడు వార్షిక ప్రాతిపదికన రూ. 250 నుండి రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ పథకం కింద ఖాతాదారులు డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీ రేటు ప్రయోజనం పొందుతారు. అమ్మాయికి 15 ఏళ్లు వచ్చే వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత డబ్బు 21 సంవత్సరాల వయస్సు వరకు వేచి ఉండాలి.


రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుంది?

ఒక వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టినప్పటి నుండి సుకన్య సమృద్ధి యోజనలో ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టాలి. ఇలా 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి. అంటే 15 సంవత్సరాలకు మీరు రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. SSY కాలిక్యులేటర్ ప్రకారం, అమ్మాయికి 21 సంవత్సరాలు నిండినప్పుడు.. మొత్తం రూ. 46,18,385 పొందుతారు. ఇందులో ఇన్వెస్ట్ చేసిన రూ.15 లక్షలకు అదనంగా రూ.31,18,385 వడ్డీ లభిస్తుంది.


SSYకి సంబంధించిన ఇతర వివరాలు..

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు మినహాయింపు పొందుతారు. దీంతో పాటు, మెచ్యూరిటీపై ఖాతాదారులు స్వీకరించే మొత్తం కూడా పూర్తిగా పన్ను రహితం. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రత్యేక పరిస్థితులలో ముందుగా మెచ్యూర్‌గా డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వబడుతుంది. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత, ఆమె చదువుల కోసం ఖాతా నుంచి 50 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతాను తెరిచిన తర్వాత, అత్యవసర పరిస్థితుల్లో ఖాతా నుండి డబ్బు తీసుకోవచ్చు.

For More Business News and Telugu News..

Updated Date - Jul 01 , 2024 | 01:01 PM