Share News

Madhya Pradesh: నిశ్చితార్థానికి కొన్ని గంటల ముందు హ్యాండిచ్చిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

ABN , Publish Date - Jul 08 , 2024 | 08:25 AM

వివాహం కుదిరిన తర్వాత.. కొన్ని కారణాల వల్ల పెళ్లిపీటల వరకు రాకుండా ఆగిపోయిన సందర్భాలు ఎన్నో చూస్తుంటాం. పెళ్లి మధ్యలోనే ఆగిపోయిందని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడే ఘటనలు ఎన్నో ఉన్నాయి.

Madhya Pradesh: నిశ్చితార్థానికి కొన్ని గంటల ముందు హ్యాండిచ్చిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
File Photo

వివాహం కుదిరిన తర్వాత.. కొన్ని కారణాల వల్ల పెళ్లిపీటల వరకు రాకుండా ఆగిపోయిన సందర్భాలు ఎన్నో చూస్తుంటాం. పెళ్లి మధ్యలోనే ఆగిపోయిందని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడే ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి మధ్యలో ఆగిపోతే వధువులు ఎక్కువుగా మనస్తాపానికి గురవుతుంటారు. వరుడు నో చెప్పడంతో కొన్ని పెళ్లిళ్లు ఆగిపోతే.. వధువు నో చెప్పడంతోనూ కొన్ని పెళ్లిళ్లు మధ్యలోనే ఆగిపోతాయి. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత.. యువతి ఎంగైజ్‌మెంట్‌కు రాకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. నిశితార్థం రద్దు చేసుకోవడానికి ప్రత్యేకమైన కారణాలను యువతి కుటుంబసభ్యులు చెప్పలేదు.

చార్‌ధామ్‌ యాత్ర తాత్కాలిక నిలిపివేత


అంతా రెడీ..

ఇల్లంతా నిశ్చితార్థానికి సిద్ధమైంది. ఇంటి బయట టెంట్లు వేశారు. అతిథుల కోసం రకరకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఈలోపు యువతి కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. మేము నిశ్చితార్థానికి రావడంలేదని చెప్పారు. దీంతో పెళ్లి ఆగిపోయిందని తెలుసుకున్న ఆ యువకుడు మనస్తాపానికి గురయ్యాడు. ఓరకంగా చెప్పాలంటే అనుకున్న అమ్మాయితో తన వివాహం జరగదన్న విషయాన్ని యువకుడు తట్టుకోలేకపోయాడు.. రెండు రోజులపాటు మౌనంగా ఉండిపోయాడు. చివరకు ఆదివారం తన ఇంట్లో విషం తాగి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Jagannath Rath Yatra : పూరీ రథయాత్రలో తొక్కిసలాట


జబల్‌పూర్ జిల్లాలో

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా భటౌలీ గ్రామంలో బసోరి అనే యువకుడికి ఓ అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. నిశ్చితార్థం జూలై 5న జరగాల్సిఉంది. అయితే చివరి క్షణంలో అమ్మాయి కుటుంబ సభ్యులు ఎంగైజ్‌మెంట్‌కు రాకపోవడంతో బసోరి నిరుత్సాహానికి గురయ్యాడు. రెండు రోజుల తరువాత తన ఇంట్లోని ఓ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. కొన్ని వస్తువుల కోసం బసోరి ఉన్న గదికి తన తల్లి వెళ్లడంతో విషయం బయటపడింది. అతని దగ్గర ఖాళీ పురుగుమందుల సీసా పడి ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న కొడుకును చూసి తల్లి పెద్దగా కేకలు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు బసోరిని ఆస్పత్రికి తరలించారు. ఈకేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం యువత వాంగ్మూలం ఇచ్చే పరిస్థితి లేదని.. మరోవైపు యువకుడికి స్పృహ వచ్చిన వెంటనే అతని స్టేట్‌మెంట్ తీసుకుంటామని పోలీసులు వెల్లడవించారు. బసోరి స్పృహలోకి వచ్చినప్పుడు మాత్రమే అతడు ఎందుకు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడో చెప్పగలమని పోలీసులు తెలిపారు.


రష్యాపై ఉక్రెయిన్‌ దాడులు.. వొరెనెజ్‌లో ఎమర్జెన్సీ

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 08 , 2024 | 08:25 AM