Share News

Education News: బీఎస్సీ అగ్రికల్చర్‌ చదవాలనుకుంటున్నారా.. అయితే ఇదే మీకు మంచి అవకాశం..

ABN , Publish Date - Sep 28 , 2024 | 04:29 PM

మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ఆధ్వర్యంలోని మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలలు అందిస్తున్న బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది.

Education News: బీఎస్సీ అగ్రికల్చర్‌ చదవాలనుకుంటున్నారా.. అయితే ఇదే మీకు మంచి అవకాశం..

ఇంటర్నెట్ డెస్క్: మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ఆధ్వర్యంలోని మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలలు అందిస్తున్న బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. వనపర్తి అగ్రికల్చరల్‌ కాలేజ్‌, కరీంనగర్‌ అగ్రికల్చరల్‌ కాలేజీల్లో అడ్మిషన్స్‌ నిర్వహిస్తారు. ఒక్కో కాలేజీలో 120 సీట్లు ఉన్నాయి. తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 స్కోర్‌ ప్రకారం 85 శాతం సీట్లను భర్తీ చేస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను పీజేటీఎస్ఏయూ అగ్రిసెట్‌ 2024 స్కోర్‌ ద్వారా భర్తీ చేస్తారు. అంటే తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 అభ్యర్థులకు 102 సీట్లు, పీజేటీఎస్ఏయూ అగ్రిసెట్‌ 2024 అభ్యర్థులకు 18 సీట్లు కేటాయించారు. బీసీ అభ్యర్థులకు 75 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 5 శాతం, ఓసీ/ఈబీసీ అభ్యర్థులకు 2 శాతం, అనాథలకు 3 శాతం సీట్లు నిర్దేశించారు. రాష్ట్రానికి చెందిన మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు.


అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజికల్‌ సైన్సెస్‌, బయలాజికల్‌ సైన్సెస్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌/పన్నెండోతరగతి/తత్సమాన కోర్సు లేదా పీజేటీఎస్‌ఏయూ నుంచి రెండేళ్ల డిప్లొమా(అగ్రికల్చర్‌/సీడ్‌ టెక్నాలజీ/ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌) ఉత్తీర్ణులై ఉండాలి. తెలంగాణ ఈఏపీసెట్‌ 2024(బైపీసీ స్ట్రీమ్‌) లేదా పీజేటీఎస్ఏయూ అగ్రిసెట్‌ 2024 అర్హత పొంది ఉండాలి. అభ్యర్థి వయసు 2024 డిసెంబరు 31 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000; పట్టణాల్లో రూ.2,00,000 మించకూడదు.


ముఖ్య సమాచారం

  • దరఖాస్తు ఫీజు: రూ.1000

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 10

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులో కరెక్షన్స్‌ విండో ఓపెన్‌: అక్టోబరు 11 నుంచి 12 వరకు

  • వెబ్‌సైట్‌: mjptbcwreis.telangana.gov.in


ఈ వార్తలు కూడా చదవండి:

Repair of records: ఇంటర్ చదివిన వారికి శుభవార్త.. నేషనల్‌ ఆర్కైవ్స్‌లో స్పెషల్‌ ట్రెయినింగ్‌..

Education News: ఏసెట్‌ అక్టోబర్-2024 సెషన్‌ నోటిఫికేషన్‌ విడుదల..

CTTC Free Training: ఐటీఐ, డిప్లొమా చేసిన వారికి శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ ఇచ్చి..

Education News: ఐసర్‌ భోపాల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల..

Updated Date - Sep 28 , 2024 | 04:29 PM