Share News

Loksabha Polls: ఆప్‌కు ఊరట..? ఎందుకంటే...?

ABN , Publish Date - May 04 , 2024 | 12:05 PM

పార్లమెంట్ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ రిలీఫ్ కలిగింది. ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే దిలిప్ పాండే రాసి, పాటిన పాటకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఆ పాటకు మార్పులు చేయడంతో ఈసీ ఎన్నికల్లో వాడుకునేందుకు అంగీకరించింది.

Loksabha Polls: ఆప్‌కు ఊరట..? ఎందుకంటే...?
AAP Campaign Song

ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) బిగ్ రిలీఫ్ కలిగింది. ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే దిలిప్ పాండే రాసి, పాటిన పాటకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఆ పాటకు మార్పులు చేయడంతో ఈసీ ఎన్నికల్లో వాడుకునేందుకు అంగీకరించింది. ‘జైల్ కా జవాబ్ వోట్ సే దెయింగే’ అనే పాట కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. ఫిర్యాదులు రావడంతో మార్పు, చేర్పులు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఆ మార్పు చేయడంతో ఎన్నికల్లో వాడేందుకు పర్మిషన్ ఇచ్చింది.


కేజ్రీవాల్ అరెస్ట్

లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌కు జరిగిన అన్యాయం గురించి ఆప్ నేత దిలిప్ పాండే పరోక్షంగా పాట రూపంలో తీసుకొచ్చారు. జైలులో ఉన్న తమ నేత గురించి వర్ణించారు. మీ ఆమూల్యమైన ఓటుతో బుద్ది చెప్పాలని కోరారు. ఆ పాటపై అభ్యంతరాలు రావడంతో గత నెల 28వ తేదీన ఎన్నికల సంఘం అధికారులు నిషేధం విధించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు, ప్రకటనల కోడ్‌కు విరుద్దంగా పాట ఉందని స్పష్టం చేశారు. మార్పులు చేయాలని, సూచించారు. ఆ పాటకు సవరణలు చేసి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయానికి పంపించారు. తర్వాత పాటను చూసి ఆమోదించారని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు.


సెంటిమెంట్

తాను రాసిన పాటకు ఎదురయిన ఇబ్బందుల గురించి పాండే మాట్లాడారు. ‘నీతి, నిజాయితీకి సమస్యలు ఎదురవుతాయి. అలా అని ఓడిపోయినట్టు కాదు. జైల్ కా జవాబ్ వోట్ సే దేయింగే సాంగ్ కేవలం తమ పార్టీకి చెందిన పాట మాత్రమే కాదు. దేశంలో ఉన్న ప్రజల మదిలో కొనసాగుతోన్న సెంటిమెంట్. చివరికి సత్యమే గెలిచింది. ఎన్నికల సంఘం తమ పాటకు అనుమతి ఇచ్చింది. సత్యమేవ జయతే అని’ పాండే అభిప్రాయ పడ్డారు.


For
Latest News and National News click here

Updated Date - May 04 , 2024 | 12:05 PM