Share News

Rahul Gandhi: రాహుల్ గాంధీ కోసం రాయ్ బరేలికి క్యూ కట్టిన టీ కాంగ్రెస్

ABN , Publish Date - May 16 , 2024 | 01:55 PM

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా రాయ్ బరేలికి క్యూ కట్టారు. రాహుల్ గాంధీ రాయ్ బరేలి నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. రేపు లేదా ఎల్లుండి రాయ్ బరేలిలో ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తెలంగాణ ఎన్నికలు ముగిసినందున రాయ్ బరేలిలో ప్రచారానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ కోసం రాయ్ బరేలికి క్యూ కట్టిన టీ కాంగ్రెస్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా రాయ్ బరేలికి క్యూ కట్టారు. రాహుల్ గాంధీ రాయ్ బరేలి నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. రేపు లేదా ఎల్లుండి రాయ్ బరేలిలో ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తెలంగాణ ఎన్నికలు ముగిసినందున రాయ్ బరేలిలో ప్రచారానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు. ఇప్పటికే రాహుల్ గాంధీకి మద్దతుగా సీతక్క, వీహెచ్ తదితరులు ప్రచారం మొదలు పెట్టారు.

Lok Sabha Elections: అన్నా.. ఎవరు గెలుస్తరే..?


నేటి మధ్యాహ్నం మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లనున్నారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ రేపు రాయ్ బరేలి వెళ్లనున్నారు. రాజ్యసభ ఎంపీలు రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ సైతం రాయ్ బరేలికి వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ కోసం ప్రచారం చేయడానికి ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు బయల్దేరారు. తెలంగాణ ఎన్నికల్లో విజయానికి రాహుల్ గాంధీ కృషి చేశారు. ఇప్పుడు రాహుల్‌కి తెలంగాణ కాంగ్రెస్ నేతలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారు.

ఇవి కూడా చదవండి...

TDP: టీడీపీ మహానాడు వాయిదా.. రీజన్ ఇదే!

AP News: రెచ్చిపోతున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు

Read Latest AP News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 01:55 PM