Share News

Cross Vote: క్రాస్ ఓటింగ్ అంటే ఇదే.. ఇలా చేస్తే కొంప కొల్లేరే..?

ABN , Publish Date - May 11 , 2024 | 12:48 PM

సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తుంటారు. పోలింగ్ జరిగే సమయంలో కొందరు అభ్యర్థులు టెన్షన్‌కు గురి అవుతుంటారు. స్వతంత్ర్య అభ్యర్థులను క్రాస్ ఓటింగ్ సమస్య వణికిస్తోంది. తమ లాంటి గుర్తు మరో అభ్యర్థికి కేటాయిస్తే ఓటరు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఒకరికి వేసే ఓటు మరొకరి వేస్తారు. అలా ఎక్కువ మంది గందరగోళానికి గురయితే గెలిచే అభ్యర్థి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి.

Cross Vote: క్రాస్ ఓటింగ్ అంటే ఇదే.. ఇలా చేస్తే కొంప కొల్లేరే..?
cross vote

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తుంటారు. పోలింగ్ జరిగే సమయంలో కొందరు అభ్యర్థులు టెన్షన్‌కు గురి అవుతుంటారు. స్వతంత్ర్య అభ్యర్థులను క్రాస్ ఓటింగ్ (cross vote) సమస్య వణికిస్తోంది. తమ లాంటి గుర్తు మరో అభ్యర్థికి కేటాయిస్తే ఓటరు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఒకరికి వేసే ఓటు మరొకరి వేస్తారు. అలా ఎక్కువ మంది గందరగోళానికి గురయితే గెలిచే అభ్యర్థి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే క్రాస్ ఓటింగ్ అంటే అభ్యర్థులు విపరీతంగా టెన్షన్ పడుతుంటారు.


క్రాస్ ఓటింగ్ అంటే..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు ఈవీఎంలలో వయోజనుడు ఓటు వేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలకు చెందిన గుర్తులు వరస క్రమంలో ఉంటాయి. తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లు కనిపిస్తాయి. ఉదహరణకు అసెంబ్లీలో ఎల్లయ్య అనే అభ్యర్థికి తాళం గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు అనుకొండి.. లోక్ సభ ఎన్నికలో మరో మల్లయ్య అనే స్వతంత్ర అభ్యర్థికి తాళం గుర్తు ఉంటుంది. ఆ సమయంలో మల్లయ్యకు వేసే ఓటును ఎల్లయ్యకు, ఎల్లయ్యకు వేసే ఓటును మల్లయ్యను ఓటర్లు వేస్తే సదరు అభ్యర్థి నష్ట పోతారు. దేశ చరిత్రలో స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. క్రాస్ ఓటింగ్ వల్ల ఆ అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉంది.


గెలవకున్నా..? మేలు

ఇలా క్రాస్ ఓటింగ్ వల్ల గెలిచే అభ్యర్థి ఓడిపోతారు. ఓ రాజకీయ పార్టీ నుంచి టికెట్ రానీ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారు. తన గుర్తును ఆ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేసుకుంటారు. చివరికి క్రాస్ ఓటింగ్ (Cross Vote) జరగడం వల్ల ఓడిపోతారు. కొన్ని సందర్భాల్లో సదరు అభ్యర్థి గెలవకున్నా మరో క్యాండెట్ విజయానికి దోహదం చేస్తుంటారు. గెలిచే రాజకీయ పార్టీ నేత ఓడి పోవచ్చు, ఓడి పోయే మరో నేత గెలవవచ్చు. ఇలా క్రాస్ ఓటింగ్ వల్ల ఫలితాలు తారుమారు అయినా ఘటనలను చాలా చూశాం. అసెంబ్లీ, లోక్ సభకు పోటీచేసే స్వతంత్ర అభ్యర్థులకు ఓకే గుర్తు కేటాయించొద్దని పలువురు ఎన్నికల సంఘాన్ని విన్నవించారు. ఓకే స్థానానికి ఎక్కువ మంది బరిలో నిలబడటంతో అసెంబ్లీ, లోక్ సభకు గుర్తులను కేటాయించాల్సి వస్తోంది.


ప్రత్యక్ష ఉదహరణ

2004లో మెట్ పల్లిలో క్రాస్ ఓటింగ్ వల్ల ఇండిపెండెంట్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నష్ట పోయారు. టీడీపీ- బీజేపీ పొత్తులో భాగంగా విద్యాసాగర్ రావుకు టికెట్ రాలేదు. బీజేపీ నుంచి తుమ్మల వెంకట రమణారెడ్డి బరిలోకి దిగారు. టీడీపీ నుంచి టికెట్ రాకపోవడంతో విద్యాసాగర్ రావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. విమానం గుర్తు కేటాయించారు. ఆ సమయంలో కరీంనగర్ పార్లమెంట్ నుంచి మరో అభ్యర్థి పోటీ చేశారు. సదరు అభ్యర్థికి కూడా విమానం గుర్తు కేటాయించారు. ఆ సమయంలో విద్యాసాగర్ రావు జోరుగా ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నిక అని ఓటర్లకు చెప్పకపోవడం మైనస్ అయ్యింది. ఓటర్లకు అవగాహన లేకుండా ఎంపీ అభ్యర్థికి ఓటు వేశారు. అలా ఓ అనామక అభ్యర్థికి 20 వేల ఓట్లు వచ్చాయి. క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ విషయం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది.


బీఆర్ఎస్ అభ్యంతరం

బీఆర్ఎస్ గుర్తు కారు మరో రైలు ఇంజిన్ దాదాపు సేమ్ ఉంది. ఈవీఎంలలో అభ్యర్థులు కన్ ఫ్యూజ్ అయ్యారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. గుర్తుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా సేమ్ ఉండటం వల్ల తమ పార్టీకి మైనస్ అవుతుందని అంటున్నారు.



Read Latest
Telangana News And Telugu News

Updated Date - May 12 , 2024 | 11:14 AM