Share News

Collagen Foods: ఈ 5 ఆహారాలు తప్పనిసరిగా తినండి.. కొల్లాజెన్ పెరిగి యవ్వనంగా కనిపిస్తారు..!

ABN , Publish Date - Aug 08 , 2024 | 03:45 PM

అందంగా కనిపించడం కోసం చాలామంది బోలెడు బ్యూటీ ఉత్పత్తులు ఉపయోగిస్తారు. అయితే ఇవన్నీ తాత్కాలిక అందాన్ని ఇస్తాయి. కానీ ఎక్కువకాలం పాటూ అందంగా కనిపించాలంటే ఆహారంతో మ్యాజిక్ చేయాలి.

Collagen Foods: ఈ 5 ఆహారాలు తప్పనిసరిగా తినండి.. కొల్లాజెన్ పెరిగి యవ్వనంగా కనిపిస్తారు..!
Collagen Foods

అందంగా కనిపించడం కోసం చాలామంది బోలెడు బ్యూటీ ఉత్పత్తులు ఉపయోగిస్తారు. అయితే ఇవన్నీ తాత్కాలిక అందాన్ని ఇస్తాయి. కానీ ఎక్కువకాలం పాటూ అందంగా కనిపించాలంటే ఆహారంతో మ్యాజిక్ చేయాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అందంగా కనిపించవచ్చు. ముఖ్యంగా చర్మం యవ్వనంగా, ముడతలు లేకుండా కనిపించాలంటే కొల్లాజెన్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 30 సంవత్సరాల తరువాత ప్రతి ఒక్కరి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి మందగిస్తుంది. దీని వల్లే 30ఏళ్ల తరువాత చాలామంది తొందరగా వయసు పైనబడినట్టు కనిపిస్తుంటారు. కానీ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఆహారాలు తీసుకుంటే వయసు పెరిగినా యవ్వనంగా కనిపించవచ్చు.

Water poisoning: నీరు కూడా విషంలా పనిచేస్తుందా? ఎవరికి ఇలా జరిగే అవకాశం ఉంటుందంటే..!



కొల్లాజెన్ ఆహారాలు..

  • కొల్లాజెన్ సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకుంటే చర్మం మెరుస్తూ యవ్వనంగా ఉంటుంది. దీనికోసం ఆహారంలో చికెన్, చేపలు, బీన్స్, పాలు, పాల ఉత్పత్తులు సమృద్దిగా తీసుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా సిట్రస్ పండ్లు కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. సిట్రస్ పండ్లు కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి.

  • బెర్రీ జాతికి చెందిన పండ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. బెర్రీలలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ మొదలైనవి తినవచ్చు.

  • వెల్లుల్లిని చాలామంది రుచి, సువాసన కోసం వాడితే మరికొంతమంది ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడతారు. అయితే వెల్లుల్లిని ఆహారంలో తీసుకుంటూ ఉంటే యవ్వనంగా ఉండవచ్చట. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

Paneer: మీకు పనీర్ అంటే బాగా ఇష్టమా? ఈ 6 సమస్యలున్నవారు పొరపాటున కూడా తినకూడదట..!



  • జీడిపప్పును వివిధ రకాల వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని స్నాక్స్ గా కూడా తినవచ్చు. జీడిపప్పులో జింక్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ స్థాయిలు పెంచడంలో సహాయపడతాయి.

  • ఆకుకూరలలో విటమిన్-సి, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్ పుష్కంలగా ఉంటాయి. కొల్లాజెన్ ను దెబ్బతీసే సూర్యకిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో కూడా ఆకుకూరలో ఉండే పోషకాలు సహాయపడతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.

ఆడవారు 30ఏళ్ళ తర్వాత తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవి..!

ఈ 5 సమస్యలు ఉన్నవారు ముల్లంగిని అస్సలు తినకూడదు..!


నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.


Updated Date - Aug 08 , 2024 | 03:45 PM