Share News

Diabetes: మధుమేహం ఉన్నవారికి అలర్ట్.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ మిస్టేక్స్ చేస్తే డేంజరే..!

ABN , Publish Date - Jul 31 , 2024 | 09:21 AM

భారతదేశంలో 101 మిలియన్ల మంది డయాబెటిక్ రోగులు, 136 మిలియన్ల ప్రీడయాబెటిక్ రోగులు ఉన్నారు. ఇది కేవలం మధ్య వయస్కులు, వృద్దులలోనే కాకుండా చిన్న వయసు వారిలో కూడా వస్తోంది.

Diabetes: మధుమేహం ఉన్నవారికి అలర్ట్.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ మిస్టేక్స్ చేస్తే డేంజరే..!
Diabetes

మధుమేహం సాధారణ ఆరోగ్య సమస్యలలో ఒక్కటిగా చేరిపోయే పరిస్థితికి వచ్చింది. నివేదికల ప్రకారం భారతదేశంలో 101 మిలియన్ల మంది డయాబెటిక్ రోగులు, 136 మిలియన్ల ప్రీడయాబెటిక్ రోగులు ఉన్నారు. ఇది కేవలం మధ్య వయస్కులు, వృద్దులలోనే కాకుండా చిన్న వయసు వారిలో కూడా వస్తోంది. మధుమేహాన్ని చాలా వరకు ఆహారం, జీవనశైలి ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా నియంత్రణలో పెట్టవచ్చు. అల్పాహారంలో తీసుకునేటప్పుడు చాలా మంది డయాబెటిక్ రోగులు చేసే మిస్టేక్స్ వారిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణం అవుతున్నాయి. అవేంటో తెలుసుకుంటే..

వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్ తింటే.. జరిగేదిదే..!


  • అల్పాహారం అయినా, భోజనం అయినా మధుమేహం ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. అన్ని పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి.

  • తృణధాన్యాలు, పప్పులు, చేపలు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి.

  • ఫైబర్ పుష్కంలగా ఉన్న ఆహారం తీసుకోవాలి. దీనివల్ల సమతుల భోజనం లభిస్తుంది. ఈ ఆహారాలలో కేలరీలను చెక్ చేసుకోవాలి. అధిక కేలరీలు మధుమేహాన్ని, బరువును పెంచుతాయి. కాబట్టి వీటిని నివారించాలి.

ఇవి తింటే చాలు.. వర్షాకాలంలో విటమిన్-డి లోపం మిమ్మల్సి టచ్ చేయదు..!


  • శరీరంలో నీటి శాతం తగ్గితే రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితం అవుతాయి. నీరు పుష్కలంగా తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. కూల్ డ్రింక్స్, చక్కెర పానీయాలు తీసుకోవడానికి నీటిని తీసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. నిమ్మరసం, గ్రీన్ టీ, సూప్, జావ వంటి లిక్విడ్ ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

  • చాలామంది అల్పాహారం ఎగ్గొడుతుంటారు. కానీ మధుమేహం ఉన్నవారు ఈ పని చేయకూడదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అస్తవ్యస్తం కావడానికి కారణం అవుతంది. వీలైనంత వరకు అల్పాహారంలో ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం మానేయాలి. ఇంటి ఆహారాన్ని తీసుకోవాలి.

ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో గ్యాడ్జెట్లు సేఫ్..!

చాణక్యుడు చెప్పిన ఈ 10 విషయాలు అనుసరిస్తే.. యువత విజయాల బాట పడతారు!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 31 , 2024 | 09:21 AM