Share News

Diabetes Vs Fruits: మీకు మధుమేహం ఉందా? జాగ్రత్త ఈ పండ్లను పొరపాటున కూడా తినకండి..!

ABN , Publish Date - Aug 15 , 2024 | 11:14 AM

డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పండ్లు తినడం ఆరోగ్యమే అయినా..

Diabetes Vs Fruits:  మీకు మధుమేహం ఉందా? జాగ్రత్త ఈ  పండ్లను పొరపాటున కూడా తినకండి..!
Diabetes Vs Fruits

డయాబెటిస్ చాలా మంది జీవితాలను తలకిందులు చేసే సమస్య. సైలెంట్ కిల్లర్ అని పేర్కొనే సమస్యలలో ఇది కూడా ఒకటి. డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పండ్లు తినడం ఆరోగ్యమే అయినా 5 రకాల పండ్లు డయాబెటిస్ రోగులకు ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. అవేంటో.. వాటిని ఎందుకు తినకూడదో తెలుసుకుంటే..

అరటిపండు..

అరటిపండులో ఉండే మూలకాలు రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా పెంచుతాయి. మధుమేహం ఉన్నవారు అరటిపండ్లను తినకూడదు. ముఖ్యంగా పండిన అరటిపండ్లను అస్సలు తినకూడదు.

Roasted Chickpeas: వేయించిన శనగల పొట్టు తీసి తింటే బెస్టా? పొట్టు తీయకుండా తింటే బెటరా?



ద్రాక్ష..

మధుమేహం ఉన్నవారు ద్రాక్ష పండ్లను తినవచ్చని అనుకుంటారు. కానీ ద్రాక్షలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ఎక్కువగా ఉన్నవారు ద్రాక్షను తినకపోవడం మంచిది.

పైనాపిల్..

రక్తంలో చక్కెర స్థాయిలు పెంచడంలో పైనాపిల్ కూడా ప్రభావవంతంగా ఉంటుంది. పండిన పైనాపిల్ లో చక్కెర కంటెంట్ ఎక్కువ. అంతేకాదు పైనాపిల్ తింటే ఆకలి పెరుగుతుంది. పదే పదే మూత్రవిసర్ఝనకు వెళ్లడాన్ని ఇది ప్రేరేపిస్తుంది.

Treadmill: ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేసేటప్పుడు ఈ మోడ్ ఆన్ చేసి చూడండి.. ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!



సపోటా..

సపోటా పండులో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు సపోటా పండు తింటే మధుమేహం తీవ్రత పెరుగుతుంది.

నారింజ..

మధుమేహం ఉన్నవారు నారింజ పండ్లు తీసుకోవడం మానేయాలి. ఇది మధుమేహ రోగులకు మంచిదే అని చాలామంది చెప్తుంటారు. కానీ మధుమేహం ఎక్కువ ఉన్నవారు నారింజ తినకూడదు. పైగా తియ్యగా ఉన్న నారింజను అస్సలు తినకపోవడం మంచిది.

త్రివర్ణ పతాక రూపకర్త.. పింగళి వెంకయ్య గురించి ఈ నిజాలు తెలుసా..?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 15 , 2024 | 11:14 AM